
తనకు హామీ ఇచ్చిన జడ్పీ పీఠం తన కుటుంబ సభ్యులకు దక్కలేదనే ఆక్రోశంతో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, తన నాయకత్వంలో గెలిచిన బీజేపీ స్థానిక నాయకులను కూడా రాజీనామా చేయిస్తానని మీడియా ముందు పెద్ద పెద్ద ప్రకటనలే చేస్తున్నారు.
అయితే ఆదినారాయణ మాదిరే కూటమిలోని ఇతర పార్టీల నాయకులు కూడా ఆలోచిస్తే 2024 లో కూటమి అధికారంలోకి వచ్చి ఉండేదా? నాడు జరిగిన సార్వత్రిక ఎన్నికల కోసం టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య మొదలైన సీట్ల పంచాయితీలో ముందుగా జనసేనకు 23 ఎమ్మెల్యే స్థానాలను ప్రకటించారు.
కానీ బీజేపీ కూడా తమకు 10 నియోజకవర్గాలు కావాల్సిందే అంటూ పట్టుబట్టడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీకి కేటాయించిన 23 ఎమ్మెల్యే సీట్లకు గాను 2 సీట్లు బీజేపీ కి కేటాయించి తానూ తగ్గి, తన పార్టీ సంఖ్యా బలాన్ని తగ్గించారు.
నాడు పవన్ కూడా తనకు ముందుగా ఇచ్చిన హామీకి నేను కట్టుబడి ఉంటాను, నేను అతగ్గేదెలా అంటూ మొండిపట్టు పట్టి ఉంటే నేడు ఆదినారాయణ రెడ్డి ఇప్పుడీ డిమాండ్లు చేసి ఉండేవారేనా? అలాగే పవన్ కోసం పిఠాపురంలో పార్టీ బలంతో పాటుగా తనకంటూ సొంత బలమున్న వర్మ తన సీటును త్యాగం చేసారు, ఆయన రాజకీయ భవిష్యత్ ని పణంగా పెట్టారు.
ఇలా అనేకమంది తమకు సొంత రాజకీయ బలం ఉన్నప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి కట్టుబడి తమ ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల త్యాగాలకు ముందుకొచ్చారు. అటువంటిది ఇప్పుడు కేవలం ఒక్క జడ్పీ పీఠం కోసం ఆదినారాయణ రెడ్డి రాజీనామా అంటూ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అపోలో ఫౌండేషన్ వైస్ చైర్‌పర్సన్…
India's blind cricket team has refused to attend the trophy presentation ceremony after Pakistan were…