Telugu

ఆడుదాం ఆంద్రా… ఓట్ల కోసం ఎన్ని ఆటలైనా!

సాధారణంగా ఏ ప్రభుత్వాలకైనా క్రీడా రంగమంటే చులకనే. ఏపీలో వైసీపీ ప్రభుత్వానికైతే మరీ చులకన! అయినా రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతి రాజధాని, పోలవరం నిర్మాణాలను, చివరికి పరిశ్రమల ఏర్పాటు కూడా పట్టించుకోనప్పుడు ఖర్చే తప్ప పైసా ఆదాయం రాని క్రీడలను పట్టించుకోదు కదా?

ADVERTISEMENT

కానీ ‘ఆడుదాం ఆంద్రా’ ఐపీఎల్ టీమ్‌ అంటూ ఓ పధకం ప్రకటించేసి దాని కోసం రూ.50 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించేసింది. ఏపీలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ క్రికెట్ అంటే ప్రాణం. కనుక నాలుగేళ్ళుగా క్రీడా రంగాన్ని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు క్రీడాభిమానుల ఓట్లకు గాలం వేసేందుకే ఇప్పుడు ‘ఆడుదాం ఆంద్రా’ అంటోందని భావించవచ్చు.

అంటే క్రీడారంగాన్ని కూడా ఎన్నికల కోణంలో నుంచే చూస్తోంది తప్ప రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చే రంగంగా చూడలేకపోవడం చాలా శోచనీయం.

నాలుగేళ్ళుగా ‘శాప్’ను పట్టించుకోలేదు. ఒక్కో నియోజకవర్గానికి కనీసం 4-5 కోచ్‌లు ఉండాలి. కానీ 175 నియోజకవర్గాలకు కలిపి శాప్‌లో 150 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 147 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్‌ సిబ్బందే!

ఇక వారైనా ఔత్సాహిక క్రీడాకారులకు శిక్షణ ఇద్దామనుకొంటే తగిన స్టేడియంలు ఉండవు. ఉన్నా వాటిలో అవసరమైన సదుపాయాలు, క్రీడా సామాగ్రి ఉండదు. క్రీడాకారులకు ఎటువంటి స్టైఫండ్ లేదా ప్రోత్సాహకాలు లభించవు.

ఇటువంటి పరిస్థితులలో కూడా ఔత్సాహిక క్రీడాకారులు శిక్షణ, ప్రాక్టీస్ కోసం ఇండోర్, అవుట్ డోర్ స్టేడియంలకు వస్తే, అందుకు నెలకు ఇంత ఛార్జీలు చెల్లించాలని వాటి నిర్వహణ కాంట్రాక్ట్ పొందిన సంస్థలు లేదా వ్యక్తులు పట్టుబడుతుంటారు. దీనిని బట్టి ఏపీలో క్రీడారంగం, క్రీడాకారుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దం చేసుకోవచ్చు.

మన క్రీడాకారులు ఒలింపిక్స్, కామన్వెల్త్ గే లో పతకాలు సాధించినప్పుడు ఏపీ ప్రభుత్వం గొప్ప కోసం వారికి నగదు బహుమతులు ప్రకటించింది. షట్లర్స్ పీవీ సింధూ, కిడాంబి శ్రీకాంత్, సాత్విక్ సాయిరాజ్, ఆర్చర్ జ్యోతి సురేఖ, హాకీ ప్లేయర్ రజిని, వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్‌కు కలిపి రూ.3 కోట్లు నగదు బహుమతి ప్రకటించింది. కానీ ఇంతవరకు చెల్లించలేదు.

ఇటువంటి పరిస్థితులలో ఏపీలో క్రీడారంగం అభివృద్ధి గురించి కలలో కూడా ఊహించలేము. అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కనుక ఆంద్రాలో ఎన్నికలాట ఆడేందుకే వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంద్ర అంటోందని భావించవచ్చు.

శాప్ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డికి క్రీడారంగంలో సమస్యలు పట్టించుకోరని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే నిధులు, సదుపాయాలు కేటాయించి, కోచ్‌లను నియమించాల్సిన ప్రభుత్వమే పట్టించుకోనప్పుడు ఆయన మాత్రం ఏమి చేయగలరు?

చివరిగా ఓ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్‌ క్రీడామంత్రి పేరు ఏమిటి? గుగూల్లో వెతక్కుండా చెప్పగలరా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఖైరతాబాద్ లో కవిత వెనుకున్న ఆ రాజకీయ బలం ఎవరు.?

ఖైరతాబాద్ ఉపఎన్నికలలో తెలంగాణ రక్షణ సేన తరుపున ఒక బలమైన అభ్యర్థిని నిలబెడతాం అంటూ కవిత చాల కాన్ఫిడెంట్ గా…

3 seconds ago

Kappi Squad Review: Average but Watchable Urban Comedy

BOTTOM LINE Average but Watchable Urban Comedy PLATFORM JioHotstar RUNTIME 1 Hour 73 Mins (4…

6 minutes ago