
నిజానికి టాక్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓపెనింగ్స్ వస్తాయనే ఓ నమ్మకం సినీ జనాల్లో, పవన్ అభిమానుల్లో నెలకొని ఉండేది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు, కానీ “అజ్ఞాతవాసి” మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం అని కుండబద్దలు కొట్టినట్లుగా నిరూపించబోతోందని సెకండ్ డే పరిస్థితి చెప్తోంది. ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంచే మల్టీప్లెక్స్ లతో పాటు, పవన్ కు ఆయువుపట్టు అయిన బి,సి సెంటర్లలో కూడా “అజ్ఞాతవాసి” ధియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. నిజంగా ఇది ఊహించని పరిణామం.
ఇటీవల కాలంలో అగ్ర హీరోల సినిమాలు భారీ నష్టాలను మిగుల్చుతూ, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు చుక్కలు చూపెడుతున్న నేపధ్యంలో… కొత్త ఏడాదిలో పవన్ కళ్యాణ్ కూడా దానిని కొనసాగించడం శోచనీయం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే, 2018 మొదటి పెద్ద సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కాళరాత్రులను మిగల్చడం ఖాయమని చెప్పొచ్చు. రాబోతున్న నాలుగైదు రోజులు పండగ సెలవులు… ‘జై సింహా’ తప్ప మరో సినిమా లేకపోవడం… అనేది ‘అజ్ఞాతవాసి’కి దోహదం చేస్తుందో లేదో చూడాలి. ఈ దారుణమైన పరిస్థితికి దర్శకుడిగా త్రివిక్రమ్ ఒక్కరే కారణం కాదు.
సినిమాలో పవన్ కళ్యాణ్ నటించిన తీరు సగటు ప్రేక్షకులకే కాదు, అభిమానులకు కూడా రుచించలేదని చెప్పొచ్చు. సాధారణంగా ప్రతి సినిమాలో ఏదో ఓ రెండు, మూడు సన్నివేశాలలో పవన్ ‘అదో టైపు’ యాక్షన్ చేసి, ఫ్యాన్స్ ను నవ్వించే ప్రయత్నం చేస్తారు. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో సగంకు పైగా సన్నివేశాలలో ‘అదో టైపు’లా నటించి నవ్వులపాలయ్యారు. బహుశా త్రివిక్రమ్ భాషలో దీనినే ‘నట విశ్వరూపం’ అంటారేమో… అంటూ నెటిజన్లు ఆడుకుంటున్న డైలాగ్ లకు కొదవలేదు. ఇప్పటికైనా ‘తామే గొప్ప, తామేం తీసినా జనం చూస్తారు’ అనే భావనలో నుండి బయటకు రావడం, ఇటు అభిమానులకు, అటు హీరో, దర్శకులకు మంచిది.
Yash’s Toxic has been getting mixed reactions since its release, but the actor is finding…
The YSR Congress top leadership is absolutely rattled by the recent developments concerning Vijaya Sai…