Telugu

“అజ్ఞాతవాసి” అప్ డేట్స్… ఒక్కరోజు ఆలస్యం..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ‘అజ్ఞాతవాసి’ సినిమాపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. ఈ సినిమా థియేటర్స్ కి వచ్చే సమయం కోసం వాళ్లంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా టీజర్ అనూహ్యమైన స్థాయిలో ఆకట్టుకోవడమే అందుకు కారణం.

జనవరి 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా, ముందుగా అనుకున్న ప్రకారం ఈ నెల 29వ తేదీన సెన్సార్ కార్యక్రమాలకు వెళ్లాల్సి వుంది. అయితే కొన్ని కారణాల వలన మరుసటి రోజుకు వాయిదాపడి, ఈ నెల 30వ తేదీన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోనుందని ట్రేడ్ టాక్. అయితే సెన్సార్ లో ఉన్న మార్పు రిలీజ్ డేట్ పై ఎలాంటి ప్రభావితం చేయబోదు.

ADVERTISEMENT

పవన్ సరసన కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాలో, సీనియర్ కథానాయికలు ఖుష్బూ .. ఇంద్రజ కీలకమైన పాత్రలను పోషించారు. పవన్ కల్యాణ్ కి ఇది 25వ సినిమా కావడం .. త్రివిక్రమ్ తో చేస్తోన్న మూడవ సినిమా కావడంతో ఇది మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kanika’s Forced Love: Is Bigg Boss Hiding Dark Secret?

Many thought Bigg Boss 20 would not be as interesting as the earlier seasons, especially…

17 minutes ago

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

8 hours ago