
ఈ సినిమా ఫస్ట్ టీజర్ విడుదల కావడానికి ముందే ఆన్ లైన్ లో లీకై హల్చల్ చేసిన విషయం తెలిసిందే. మొత్తం టీజర్ కాకపోయినప్పటికీ, అందులో ప్రధాన భాగం అధికారికంగా విడుదల కావడానికి ముందే లీకై నెట్టింట సందడి చేయగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ లో వినిపించిన పాటకు సంబంధించిన తొలి నిముషం పాట వెబ్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దేవిశ్రీ ఆలపించిన ఈ పాట అదరగొట్టే విధంగా ఉండడంతో తారక్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సినీ ప్రేక్షకులలో పాజిటివ్ బజ్ ను, క్రేజ్ ను క్రియేట్ చేయడానికి ఇది దోహదపడినా… చివరికి సినిమా విషయం దగ్గరికి వచ్చే పాటికి ఇలాంటి లీకులు ఆందోళనకు గురి చేస్తాయి. అయితే కంటెంట్ బలంగా ఉంటే, ఇలాంటి లీకులు ఎన్ని వచ్చినా ఏం కాదన్న విషయం ఇటీవల ‘బాహుబలి 2’ సినిమా నిరూపించగా, గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా నిదర్శనంగా నిలుస్తోంది. అదే సెంటిమెంట్ తో “జై లవకుశ” లీకుల పర్వం కొనసాగుతోందా? ఏమో చిత్ర యూనిట్ కే తెలియాలి.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…