Telugu

కొందరికి అఖండ సంతోషం, మరికొందరికి….

అటు సినీ పరిశ్రమలో, ఇటు రాజకీయాలలో అత్యంత పలుకుబడి కలిగినవారు నందమూరి బాలకృష్ణ. నటించిన అఖండ-2 భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. కనుక అఖండ-2పై చాలా భారీ అంచనాలున్నాయి.

అలాంటి పెద్ద హీరో, పెద్ద బడ్జెట్‌ సినిమా చివరి నిమిషంలో వాయిదాపడటం అందరికీ ఆశ్చర్యకరమే. అందుకే అటు ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో అంతగా ప్రకంపనలు వచ్చాయి.

ADVERTISEMENT

ఇది టీడీపికి చెందిన బాలకృష్ణ సినిమా. కనుక సహజంగానే గిట్టనివారు శాయశక్తుల దుష్ప్రచారం చేశారు. విమర్శలు గుప్పించారు.

కానీ వారు గ్రహించని విషయం ఏమిటంటే, అఖండ-2 విడుదలకి చిన్న ఆటంకం ఏర్పడింది తప్ప పూర్తిగా నిలిచిపోదు. అది తొలగిపోగానే విడుదలవుతుంది…. అనే చిన్న విషయం మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడేశారు.

కానీ ఇంతకాలం కలుగులలో ఎలుకల్లా దాక్కున్నవారు అందరూ ఈ చిన్న ఆటంకం చూసి అత్యుత్సాహంతో బయటకు వచ్చేసి హడావుడి చేసి, తమ ఉనికిని బయటపెట్టుకొని దొరికిపోయారు. కనుక దీనికి వారు ఎటువంటి మూల్యం చెల్లించాల్సి వస్తుందో వారికే బాగా తెలుసు.

ఇక అఖండ-2 విడుదలకు ముందు వివాదం తలెత్తడం, ఆ కారణంగా చివరి నిమిషంలో సినిమా వాయిదా పడటం వలన బాలయ్య, దర్శక నిర్మాతలు, చిత్ర బృందం ఎంత టెన్షన్ పడ్డారో వారికే తెలుసు. కానీ వారి ప్రయత్నాలు ఫలించి డిసెంబర్‌ 12న అఖండ-2 విడుదలవుతోంది. కనుక ఇప్పుడు వారికి మళ్ళీ కొత్త టెన్షన్లు మొదలవుతాయి. సినిమా హిట్ అవుతుందా లేదా? ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వస్తాయా లేదా? వంటి టెన్షన్లు తప్పవు.

అఖండ-2 డిసెంబర్‌ 12కి మారడంతో ఆ ప్రభావం చిన్న సినిమాలపై తప్పక పడుతుంది. కనుక అఖండ-2 విడుదలవుతోందని చిత్ర బృందం, బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటుంటే, ఇదే నెలలో విడుదలవుతున్న చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు ఇప్పుడు టెన్షన్ మొదలవుతుంది.

అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ప్రతీ సినిమా విడుదలకు ముందు ఈ పురిటి నొప్పులు తప్పవు. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

జైలుకెళ్ళిన ప్రతీ ఒక్కరికీ వీరతాళ్ళు వేయరా?

వైసీపీ హయంలో ఓ వెలుగు వెలిగిన వారందరూ ఇప్పుడు పోలీస్ స్టేషనలు, కోర్టుల చుట్టూ తిరగక తప్పడం లేదు. వారిలో…

5 minutes ago

Odela Apologized for Dasara Mistake: What About Paradise?

The Paradise is not just Srikanth Odela’s second film. It is also the director’s chance…

20 minutes ago