
ఈ జాబితాలో ముగ్గురు విలక్షణమైన దర్శకుల పేర్లు వినపడుతుండడం విశేషం. సామాజిక అంశాలను కమర్షియల్ కోణంలో చూపిస్తూ అద్భుతమైన హీరోయిజాన్ని చూపించడంలో దిట్ట అయిన కొరటాల శివ, అందరి కంటే ముందు వరుసలో ఉన్నాడు. ప్రస్తుతం “భరత్ అనే నేను” సినిమాతో కొరటాల బిజీగా ఉండడంతో, ఏప్రిల్ కు వరకు వేచిచూడాల్సిన పరిస్థితి. ఇదే మరో దర్శకుడు బోయపాటికి ఛాన్స్ ఇచ్చేలా చేస్తోందన్నది లేటెస్ట్ న్యూస్.
అవును… మాస్ హీరోయిజానికి నిదర్శనం అయిన బోయపాటి చేతిలో మూడవ సినిమా పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది ట్రేడ్ టాక్. నాగ్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నప్పటికీ స్క్రిప్ట్ కీలక పాత్ర పోషించడం వలన సెట్ అవుతుందో, లేదో అనేది వేచిచూడాలి. ఇక తాజాగా ఈ జాబితాలోకి వచ్చిన మరో దర్శకుడు సుకుమార్. “100% లవ్” వంటి హిట్ ను చైతూకు ఇవ్వడం సుక్కూ ప్లస్ పాయింట్.
అయితే కొత్తదనానికి పర్యాయపదం అయిన సుకుమార్ ప్రాజెక్ట్ అంటే రిస్క్ తో కూడుకున్నది కావడంతో, సుకుమార్ కాంబోపై సందేహాలు ఎక్కువగానే ఉన్నాయి. బహుశా “రంగస్థలం” విడుదలైన తర్వాత నాగ్ ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందన్నది సినీ వర్గాల టాక్. అంటే అఖిల్ మూడవ ప్రాజెక్ట్ కు కాకపోయినా, ఆ తదుపరి ప్రాజెక్ట్ సుక్కూ చేతిలో అవకాశం లేకపోలేదు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…