
విశేషం ఏమిటంటే… రెండు సినిమాలకు సంబంధించిన పైరసీలు తొలి రోజు సాయంత్రానికే ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యాయి. ‘ఎంసీఏ’ విడుదలకు ఒక రోజు ముందు నిర్మాత దిల్ రాజు ఈ పైరసీని అరికట్టాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సహజంగా పెద్ద సినిమాల విడుదల సమయంలో ఇలాంటి హంగామా సర్వ సాధారణమే.
‘ఎంసీఏ’ విషయంలో దిల్ రాజు చేసిన ఫిర్యాదు నిమిత్తం లేకుండా, ఆ సినిమా విడుదలైన తొలిరోజునే ఆన్ లైన్ లోనే కాకుండా, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాలలో కూడా పూర్తి సినిమాను పెట్టేయడం విశేషం. ‘హలో’ సినిమా పరిస్థితి దీనికి భిన్నమేమీ కాదు. ఈ సినిమా కూడా తొలి రోజు సాయంత్రానికే పైరసీ ప్రింట్ వచ్చేసి హంగామా చేస్తోంది.
ఇలా అయితే ఒక్క ‘ఎంసీఏ’ ఏంటి, ‘హలో’ ఏంటి… ఏ సినిమా అయినా చచ్చిపోవాల్సిందే కదా! కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తుంటే, ‘రివ్యూ’ల పేరుతో మా బ్రతుకులతో ఆడుకుంటున్నారంటూ గగ్గోలు పెడుతున్న దర్శకనిర్మాతలు, పైరసీపై దృష్టి పెట్టకపోవడం గమనించదగ్గ అంశం. బహుశా దీనిని నియత్రించలేమని ఫిక్స్ అయిపోయారా? లేక కొందరు ఆరోపిస్తున్నట్లుగా పైరసీ వెనుక సినీ ప్రముఖుల హస్తం ఉందా?
ఏది ఏమైనా… ఎంసీఏ అండ్ హలో సినిమాల ప్రింట్స్ తో మరోసారి పైరసీ హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’ లాంటి సినిమాలకు పైరసీ వచ్చినా, అది పెద్దగా ప్రభావితం చూపించలేదు. ఎందుకంటే అలాంటివి సిల్వర్ స్క్రీన్ పైనే చూడాల్సినవి. కానీ రొటీన్ సినిమాల విషయంలో అలా కాదు గనుక, పైరసీ ప్రభావం పెద్ద ఎత్తున చూపుతుందని చెప్పడంలో సందేహం లేదు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…