
అలాగే పెళ్లిని ఇటలీలో జరిపించేందుకు నిశ్చయించిన నాగార్జున, వివాహ వేదిక ఖరారుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. ‘అఖిల్’ చిత్రం పరాజయం తరువాత సుదీర్ఘ విరామం తీసుకుని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేసేందుకు అఖిల్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తన అన్న నాగచైతన్య, హీరోయిన్ సమంతల పెళ్లి కన్నా ముందే అఖిల్ ఓ ఇంటివాడు కానున్నాడని గతంలోనే వార్తలు రాగా, అది కార్యరూపం దాల్చుకునే విధంగా అడుగులు పడుతున్నాయి.
అయితే ఇటలీలో అత్యంత ఘనంగా పెళ్లిని జరిపించేందుకు అక్కినేని కుటుంబం ఏర్పాట్లు చేసుకుంటున్నా, ఈ సమాచారం అభిమానులను మాత్రం నిరుత్సాహపరుస్తోంది. తమ కళ్ళ ముందు పెరిగిన అఖిల్ పరిణయ వేడుకను వీక్షించాలని చాలా మంది అక్కినేని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ, వారందరికీ షాక్ ఇచ్చే విధంగా వేడుక వెల్లడి కానుండడం ఊహించిన విషయం కాదు. పెళ్లి ఇటలీలో అయినా, భారీ స్థాయిలో రిసెప్షన్ ను హైదరాబాద్ లోనే ఏర్పాటు చేయనున్నారని సమాచారం.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…