Telugu

వైరల్ : చిన్నబంగార్రాజు ‘చిలిపి’ నవ్వులు!

సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “బంగార్రాజు” మ్యూజికల్ నైట్ ఆదివారం నాడు హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సినిమాలో చిన్న, పెద్ద హీరోయిన్లు కలిపి మొత్తం 8 మంది హీరోయిన్లు ఉన్నారని ఇప్పటికే చిత్ర యూనిట్ స్పష్టంగా, ఆ ఎనిమిది మందిలో ఓ హీరోయిన్ మాత్రం ఈ ఈవెంట్ లో వైరల్ అవుతోంది.

అందుకు కారణం… నాగచైతన్యతో సాగించిన చిలిపి నవ్వులే! ఈ వేడుకలో నాగార్జున ప్రసంగిస్తున్న సమయంలో… ఒక్కసారిగా వెనక్కి తిరిగిన నాగచైతన్య హీరోయిన్ దక్ష నాగర్కర్ ను చూడగా, దానికి ‘ఏమిటి’ అన్న భావనలో దక్ష చేసిన కనుసైగలు… ఆ పైన చైతూ చిలిపి నవ్వులు… దానికి ప్రతిస్పందన హీరోయిన్ దక్ష స్మైల్స్… మొత్తంగా ఈ ఉదంతం ఈవెంట్ కే హైలైట్ అయిపోయింది.

ADVERTISEMENT

మరి స్టేజి పైన ఇంత జరుగుతుంటే, ఇంటర్నెట్ లో ఇంకెంత ఉంటుంది? అందుకు ఉదాహరణే… వైరల్ అవుతోన్న ఈ వీడియో. వీరిద్దరి ‘మూగ సంభాషణలు’ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా సమంతతో విడాకులు అయిపోయిన తర్వాత బహిరంగ వేదికపై కనిపించిన నాగచైతన్య, ఈ విధంగా ఓ హీరోయిన్ తో సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందించడం హాట్ టాపిక్ అయ్యింది.

కేవలం ఓ రొటీన్ స్మైల్ లో భాగమేనా ఇదంతా? లేక బ్యాక్ గ్రౌండ్ లో ఏమైనా కధ నడుస్తోందా? అంటూ నెటిజన్లు వేస్తోన్న ప్రశ్నలు, పంచ్ లకు కొదవలేదు. ఈ అంశంపై సమంత అభిమానులు కూడా ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. చైతూతో బ్రేకప్ తర్వాత ‘పుష్ప’లో హాట్ సాంగ్ లో తళుక్కుమన్న సమంతపై అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఇపుడు ‘కుందనపు బొమ్మ’ ఫ్యాన్స్ వంతు వచ్చింది. సమంతతో బ్రేకప్ అయ్యి కొన్ని రోజులైనా కాకముందే, మరో స్టోరీకి తెరలేపారా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఈ కౌంటర్ ఎటాకింగ్ చూస్తుంటే, సమంత – చైతూల బ్రేకప్ వారిద్దరి కంటే ఎక్కువగా అభిమానులే తీసుకున్నట్లుగా కనపడుతోంది. సమంత తన హాట్ సాంగ్ పైన వివరణ ఇచ్చుకున్నట్టే, ఈ చిలిపి నవ్వులపైన చైతూ కూడా వివరణ ఇస్తారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

CJP Protests: Is Abhijeet Dipke Justified in Insulting PM Modi?

The Cockroach Janata Party (CJP) protests have become a major talking point across the country.…

18 minutes ago

Sukumar’s Ram Charan RC17 Film: Anirudh Replaces DSP?

Devi Sri Prasad and Sukumar have shared a memorable musical journey for nearly two decades,…

48 minutes ago