
నాగ్ ఒకడుగు ముందుకేసి, ఆ జీవోకు ముందు ప్లానింగ్ చేసుకున్న సినిమాలకు మాత్రం ఇబ్బందేనని తాజాగా వెల్లడించారు. ఈ అక్కినేని హీరోలిద్దరూ వెలిబుచ్చిన లాజిక్ లో ఒక్కటైతే వాస్తవమే. జీవోకు ముందు ప్రారంభించినా, వెనుక ప్రారంభించినా “బంగార్రాజు” ఈ హీరోలిద్దరికి సొంత సినిమా కావడం అనేది బడ్జెట్ పరంగా ప్రధాన ప్లస్ పాయింట్, ఈ బెనిఫిట్ అందరికి దక్కేది కాదు.
ఈ ఇద్దరు హీరోలను పక్కన పెడితే, రెమ్యూనరేషన్ పరంగా భారీ స్థాయిలో ఇవ్వాల్సిన పేరు ఒక్కటి కనపడదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాలకు మూడవ సినిమా, హీరోయిన్ కృతి శెట్టికి మూడవ సినిమా, మిగిలిన హీరోయిన్లలో రమ్యకృష్ణ వెటరన్, మిగతా ఆరుగురి భామలలో కొంతమంది పేర్లు కూడా ప్రేక్షకులకు తెలియవు.
స్టార్ కాస్టింగ్ అంటూ లేకపోవడంతో, బడ్జెట్ లో ఎక్కువ శాతం షూటింగ్ కు, సాంకేతిక పరిజ్ఞానానికే వినియోగించారు. అయితే ఇది అన్ని సినిమాలకు సాధ్యం కాదు. బహుశా ఇదే సినిమాను వేరే ప్రొడక్షన్ సంస్థలో చేసి ఉన్నట్లయితే, ‘బంగార్రాజు’ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అప్పుడు ఈ ఇద్దరు హీరోల పారితోషికాలు కూడా తోడవుతాయి కదా!
ఒక్క సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెడుతోన్న అంశంపై ‘తనకేమి అభ్యంతరం లేదన్న’ వ్యాఖ్యలు ఏ మాత్రం సమంజసం కాదు, ఇందులో ఎన్ని లాజికల్ సమాధానాలు ఇచ్చినా! ఈ రోజు చిరంజీవి ఏపీ సీఎంను కలవడంపై “వెళ్లి రండి ఏదోకటి చేసేసి రండి అని చెప్పా, ఎవరు చేసిన ఇండస్ట్రీ గురించే” అని నాగ్ తెలిపారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…