Telugu

అల వైకుంఠపురంలో ట్రైలర్… స్టైలిష్ అండ్ పర్ఫెక్ట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో థియేట్రికల్ ట్రైలర్ కాసేపటి క్రితం సినిమాకు సంబంధించిన మ్యూజికల్ కన్సర్ట్ లో విడుదల చేశారు. ట్రైలర్ లో అసలు కథ ఏంటి అనేది చెప్పకపోయినా ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ప్రతి షాట్ సినిమాలోని భారీతనం, త్రివిక్రమ్ మేకింగ్ స్టాండర్డ్స్ క్లియర్ గా కనపడ్డాయి.

డైలాగులు కూడా ఆకట్టుకున్నాయి. నెల – ఆడవారి డైలాగు అదిరిపోయింది. అలాగే చివరిలో వచ్చే పంచ్ అభిమానులకు జోష్ ఇచ్చేది గా ఉంది. కథలో నాన్న యాంగిల్ ఉన్నట్టు స్పష్టం అవుతుంది. ఎమోషనల్ గా ఆ యాంగిల్ వర్క్ అవుట్ అయితే సంక్రాంతికి పండగే. మొత్తానికి సినిమాకు మంచి ట్రైలర్ పడింది అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. బాక్స్ ఆఫీసు వద్ద మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ తో గట్టి పోటీ ఎదురుకుంటుంది. అయితే భోగి పండగ నాటికి ఎవరు పైన ఉంటారో చూడాలి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి రెండు హిట్లు… ఇప్పుడు హ్యాట్రిక్ కోసం వారు ఆరాటపడుతున్నారు.

తన గత చిత్రం నా పేరు సూర్య పెద్ద ప్లాప్ కావడంతో బన్నీ షాక్ తిన్నాడు. ఆ తరువాత తన తరువాతి సినిమా మొదలు పెట్టడానికి ఏడాది వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. దానితో అల వైకుంఠపురములో.. సినిమాతో పెద్ద హిట్ కొట్టడానికి బన్నీ కృతనిశ్చయంతో ఉన్నాడు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karuppu Trailer Confusion Behind Dull Advance Bookings?

Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…

7 minutes ago

Will Chief Minister Help Film Industry Now?

The Tamil film industry must be very proud about the fact that one of their…

37 minutes ago