
చిన్న టీజర్ ని బట్టి పాటను అంచనా వెయ్యడం కష్టం గానీ ట్యూన్ అయితే బావున్నట్టు గానే అనిపిస్తుంది. అయితే టీజర్ లోని విజువల్స్ అన్నిటికంటే హైలైట్. ఓ మైగాడ్ డాడీ అంటూ సాగే ఈ పాట టీజర్ లో బన్నీ కుమారుడు అల్లు అయాన్ తోపాటు కుమార్తె అల్లు అర్హ ముద్దుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. బన్నీ సర్ ప్రైజ్ చాలా క్యూట్ గా ఉందని సినీ అభిమానులు అంటున్నారు.
ఈ మధ్య కాలంలో వాచ్చిన క్యూట్యెస్ట్ ప్రమోషనల్ వీడియో ఇదే. పూర్తి పాట ఈ నెల 22న విడుదల అవుతుంది. అల వైకుంఠపురములో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున విడుదల చేస్తున్నాం అంటూ ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించడం విశేషం. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ హిట్లుగా నిలవడంతో సంక్రాంతి సినిమాలన్నిటి కంటే ప్రమోషన్స్ లో అల వైకుంఠపురములో ముందు ఉంది.
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…
తమిళనాడు ఎన్నికల ఫలితాల తరువాత విజయ్ టీవీకే పార్టీ గెలుపును ఆ పార్టీ అభిమానులు జరుపుకున్న దానికంటే కాస్త అధికంగానే…