
ఈ పాట విడుదలైన మొదటి రెండు రోజులు యూ ట్యూబ్‌లో నెం 1గా ట్రెండింగ్ అవుతూ అదరగొట్టింది. కాగా ఈ పాట మరో రికార్డ్‌ను సృష్టించింది. సామజవరగమన యూట్యూబ్‌లో ఎక్కువ మంది లైక్ చేసిన పాటగా రికార్డ్ సృష్టించింది. అది అలా ఉండగా చిత్రంలోని రెండో పాట రాములో రాములా చిన్న టీజర్ కాసేపటి క్రితం విడుదల చేశారు.
సామజవరగమన క్లాస్ ఆడియన్స్ కోసమైతే రాములో రాములా మాస్ ప్రేక్షకుల కోసం. చిన్న బిట్ కావడంతో పాట గురించి చెప్పడం కష్టమే గానీ ప్రామిసింగ్ గానే ఉంది. బన్నీ స్టెప్స్, పూజా హెగ్డే గ్లామర్ ఈ పాటకు హైలైట్ గా ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. పూర్తి పాట దీపావళి సందర్భంగా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అల వైకుంఠపురములో జనవరి 12 2020న సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే అదే తేదీన తాము కూడా రాబోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు నిర్మాతలు కూడా ప్రకటించడంతో ఇప్పుడు అది సస్పెన్స్ గా మారింది. క్లాష్ అంటూ జరిగితే ఇరుపక్షాలూ నష్టపోతాయి. దీనితో ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
The Tamil film industry must be very proud about the fact that one of their…