
అవును… గడిచిన కొద్ది గంటలుగా ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. గురువారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాట్స్ మెన్ అలెక్స్ హేల్స్ క్యాచ్ ను ఎబి డివిలియర్స్ ఒంటి చేత్తో అత్యద్భుతంగా ఒడిసి పట్టుకున్న దృశ్యం ఇది. గాల్లో ఎగిరే సూపర్ మ్యాన్ ఒక్కసారిగా స్టేడియంలోకి వచ్చాడా అన్నంతగా ఏబీ ఈ క్యాచ్ ను అందుకున్నాడు.
స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన బంతిని హేల్స్ బలంగా కొట్టగా, బౌండరీ లైన్ దాటి సిక్సర్ లో పడబోతోన్న బంతిని ఒక్కసారిగా నాలుగు అడుగులు గాల్లోకి ఎగిరి, కుడిచేత్తో బంతిని అందుకుని, అలా నిలబడిన డివిలియర్స్ క్యాచ్ ను చూసి ఫ్లాట్ అవ్వని ప్రేక్షకుడు ఉండడని చెప్పడంలో సందేహం లేదు. అవాక్కయ్యే ఈ క్యాచ్ పిక్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. అందులో భాగమే ఈ వైరల్ పిక్.
The Supreme Court has suggested involving Indian cricketer Virat Kohli in a public awareness campaign…
23 ఏళ్లుగా వివాదంలో ఉన్న మియాపూర్ భూముల పై నేడు సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి భారీ…