
నాటి వైసీపీ ప్రభుత్వ ఆగడాలు, వాటి విధ్వంసాలు తవ్వే కొద్దీ ఒక్కొక్కటిగా బయటకొస్తూనే ఉంటున్నాయి. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అప్పటి వైసీపీ ప్రభుత్వ నియంత్రణా ధోరణిని ప్రశ్నిస్తూ, వాటిని దగ్గరుండి ప్రోత్సహిస్తున్న వైస్ జగన్ ను విమర్శించిన కారణంగా టీడీపీ నేత పట్టాభి కేసులు ఎదుర్కొంటే, టీడీపీ కార్యాలయాలు దాడికి గురయ్యాయి.
అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైస్ జగన్ ఆ దాడులను ఖండించడం మానేసి, నన్ను విమర్శిస్తే నా పార్టీ కార్యర్తలకు బీపీలు రావా.? మీ పార్టీ కార్యాలయాల మీద దాడులు జరగవా.? అంటూ అధికారాన్ని విధ్వంసానికి వెచ్చించారు. అయితే నాడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ మూకలు చేసిన విచక్షణ రహిత దాడులకు నాటి వైసీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు.
కూటమి ప్రభుత్వ రాక తో ఆ పాత కేసులను తిరగతోడిన అధికారులకు తవ్వే కొద్దీ ఒక్కో వైసీపీ నేత అరాచకం బయటకొస్తుంది. మంగళగిరి డీజీపీ ఆఫీస్ కు అతి సమీపంలో ఉండే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద వైసీపీ నేతలు రౌడీ ముకలతో, మారణాయుధాలతో రెచ్చిపోయి అక్కడ ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంశం చేసి, టీడీపీ సిబ్బనది పై దాడికి తెగబడ్డారు.
అయితే ఈకేసులో ఇప్పటికే దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, జోగి రమేష్, నందిగామ సురేష్ వంటి వైసీపీ ముఖ్య నేతల పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో కొంతమంది ఇప్పటికే అరెస్టయ్యి విచారణను ఎదుర్కుంటున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ సలహాదారుగా, నాటి సకల శాఖ మంత్రిగా నాడు చక్రం తిప్పిన సజ్జల గారి పాత్ర కూడా ఈ విధ్వంశంలో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇక ఇప్పుడు తాజాగా సిఐడి జరిపిన విచారణలో భాగంగా మరో వైసీపీ ముఖ్య నేత పేరు బయటకొచ్చింది. వైస్ జగన్ ను అత్యంత సన్నిహితుడు, రాజధాని అమరావతి పతనానికి పునాది కర్త, మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కరకట్ట కమలహాసన్ గా పేరు పొందిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేసారు.
టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో 127 వ ముద్దాయిగా ఆర్కే పేరు బయటకు రావడంతో ఒక్క విధ్వంశం వెనుక ఇన్ని శక్తులా.? అంటూ నోరెళ్లబెడుతున్నారు సామాన్య ప్రజానీకం. నాడు జగన్ ను నమ్మి జగన్ కోసం అన్ని రాజకీయ హద్దులు దాటేసారు ఆర్కే.
తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టేవాడిలా, తనను నమ్మి ఓటేసి గెలిపించిన మంగళగిరి ప్రజలనే ఆర్కే నట్టేట ముంచి చివరికి ప్రజలు ఛీత్కారం తో పాటుగా అధినేత నుంచి అవమానాలను సైతం రిటర్న్ గిఫ్ట్ గా పొందారు. అయితే ప్రస్తుతానికి వైసీపీకి దూరంగా రాజకీయాలకు తాత్కాలిక విరామాన్ని ప్రకటించి అజ్ఞాత జీవితం అనుభవిస్తున్నారు ఆర్కే.
BOTTOM LINE Outdated Comedy, Comrade RATING 1.75/5 Story, Screenplay,Director: Janakiram Marella Cast: Sree Vishnu, Mahima…
BOTTOM LINE Novel Thriller, Slightly Overstuffed PLATFORM SonyLIV RUNTIME 6 Hours [7 Episodes] What Is…