Telugu

సత్తెనపల్లిలో ఆళ్ళ గోల ఏమిటో?

పల్నాడు జిల్లాకు చారిత్రక ప్రాధాన్యం ఉంటే జిల్లాలో గుర్తింపుకి నోచుకోని సత్తెనపల్లికి మాజీ మాంత్రి అంబటి రాంబాబు తన డాన్సులతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించి పెట్టారు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు సత్తెనపల్లిలో అంబటి రాంబాబు డాన్స్ చేస్తామంటే కుదరదు అంటున్నారు.. కూటమి ప్రభుత్వంలో నేతలు కాదు సొంత పార్టీలో, సొంత నియోజకవర్గంలోనే నేతలే.

ఇంతకాలం అంబటి రాంబాబు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్నట్లు సాగిందని ఇప్పుడు తప్పనిసరిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమించాలని ఆయన వ్యతిరేక వర్గం పట్టుబడుతోంది.

జగన్‌ కూడా ఆళ్ళకే మొగ్గు చూపుతున్నారు. ఆయనకు శాసనసభ ఎన్నికలలో టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చినందున చాలా బాధపడుతున్నారు. పార్టీకి దూరంగా ఉంటున్నారు.

కనుక ‘పురజనుల కోరిక మేరకు’ ఆళ్ళ రామకృష్ణా రెడ్డికి సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తే అలకపాన్పు దిగుతారని జగన్‌ భావిస్తున్నారు.

ఒకవేళ రెడ్డి సామాజిక వర్గానికే సత్తెనపల్లిని కట్టబెట్టాలనుకుంటే “నా దగ్గర కూడా ఉన్నారు ఓ ఆళ్ళ..” అంటూ అంబటి రాంబాబు తన సన్నిహితుడు, కాంట్రాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డిని జగన్‌ వద్దకు తీసుకువెళ్ళి పరిచయం చేసి ఆయనకే సత్తెనపల్లి ఇన్‌ఛార్జిగా నియమించాలని కోరారు.

తమ ఇద్దరి మద్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది కనుక తాను గుంటూరు వైసీపీ ఇన్‌ఛార్జిగా వెళ్ళినా సత్తెనపల్లి తన చేయి జారిపోకుండా ఉంటుందని అంబటి రాంబాబు తాపత్రయపడుతున్నట్లున్నారు.

కానీ వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు చేసిన ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని కాదని అంబటి రాంబాబు రైట్ హ్యాండ్ ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని తెచ్చి తమ నెత్తిన పెడితే ఒప్పుకోబోమని సత్తెనపల్లిలో అంబటి వ్యతిరేక వర్గం హెచ్చరిస్తోంది.

కనుక ఆళ్ళ.. ఈళ్ళ గోల మనకెందుకు.. మోదుగుల శ్రీనివాస్ రెడ్డి దించాలని జగన్‌ భావించారు. కానీ అందుకు ఆయన నిరాకరించిన్నట్లు తెలుస్తోంది.

కనుక సత్తెనపల్లిలో ఏదో ఓ ఆళ్ళని దించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆ ఆళ్ళ మనోడా కాదా.. అనేది ఇంకా తేలాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

26 minutes ago

Amaravati Railway Line Likely by 2028-29, Tenders Progress

Amaravati could get railway connectivity by late 2028 or early 2029 through a 57-km railway…

26 minutes ago