Telugu

నాగార్జున 9669… అల్లు అరవింద్ 9580..!

ఇటీవల కాలంలో సినీ సెలబ్రిటీలు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి ఎక్కువగా సందర్శిస్తున్నారు. తమ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి రావడం, ఫ్యాన్సీ నెంబర్లను దక్కించుకోవడం షరామామూలుగా మారిపోయింది. తాజాగా ఆ కోవలోనే ‘కింగ్’ నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా చేరారు.

తన ఇన్నోవా కొత్త వాహనానికి నాగార్జున టీఎస్ 09 ఈఎన్ 9669 నెంబర్ ను వేయించుకోగా, అల్లు అరవింద్ తన మారుతీ స్విఫ్ట్ డిజైర్ కు టీఎస్ 09 ఈఎన్ 9580 నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఇందులో కూడా అల్లు అరవింద్ మార్క్ కనపడిదంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. సహజంగా సినీ సెలబ్రిటీలు ఫ్యాన్సీ నెంబర్లను తమ వాహనాలపై వేయిస్తారన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టాడనికైనా వెనుకాడరు. నాగార్జున రిజిస్ట్రేషన్ చేసిన నెంబర్ ఫ్యాన్సీదే కాగా, అల్లు అరవింద్ మాత్రం ఒక రొటీన్ నెంబర్ తో చేయించడం అల్లు వారి శైలికి అద్దం పడుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అసలు సిసలు ‘పిసినారి’గా అల్లు అరవింద్ కున్న పేరు తెలియనిది కాదు. వివిధ సందర్భాలలో మెగాస్టార్ చిరంజీవితో సహా అల్లు అర్జున్ కూడా అరవింద్ ‘పిసినారితనం’ గురించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉదంతంతో మరోసారి వెలుగులోకి వచ్చింది అన్న టాక్ హల్చల్ చేస్తోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

September 24 or October? The Paradise Faces a Big Call

Nani has big plans for The Paradise. The film is not being treated as just…

52 minutes ago

పెద్దాయన మారారు.. యువనేత మాత్రం మారరా?

సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…

56 minutes ago