
“మీ అందరికీ ఎలా నచ్చుతుందోనన్న క్యూరియాసిటీ నాక్కూడా ఉంది. మీకు ఏమైనా నచ్చితే ఏం నచ్చిందో, ఒకవేళ నచ్చకపోతే ఏం నచ్చలేదో అన్న విషయాన్ని ట్వీట్ రూపంలో కాకుండా, ఒకటి, రెండు నిముషాలలో వీడియో చేస్తే నాక్కూడా చూడాలని ఉంది, నేను ఇష్టపడి చేశా, కష్టపడి కాదు” అంటూ నవ్వేశారు అల్లు అర్జున్. ఏ ఉద్దేశంతో బన్నీ ఈ వ్యాఖ్యలు చేసారో అన్న టాక్ మీడియా వర్గాల్లో వ్యక్తమయింది.
ఇక, తెలుగు నాట ప్రమోషన్స్ ముగించుకున్న అల్లు అర్జున్, బుధవారం నాడు బెంగుళూర్ లో “పుష్ప” ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగస్వామ్యులు అవుతారు. అలాగే బాలీవుడ్ లో ఇప్పటివరకు కొరవడిన “పుష్ప” పబ్లిసిటీకి విడుదలకు ఒక్క రోజు ముందు శ్రీకారం చుట్టబోతున్నారు. గురువారం నాడు ముంబైలో ఉంటానని తెలిపిన బన్నీకి బాలీవుడ్ ఎలా స్వాగతం పలుకుతుందో చూడాలి.
తెలుగు ప్రేక్షకుల కోసమే “పుష్ప” చేశామని, కంటెంట్ ఇతర భాషల వారికి కూడా నచ్చుతుందన్న నమ్మకంతో డబ్ చేశామని తెలిపిన బన్నీ, పబ్లిసిటీ విషయంలో తాము అనుకున్నది చేయలేకపోయిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కు సంబంధించి ఇంత సమయం “పుష్ప”కు పడుతుందని, తనతో సహా దర్శకుడు సుకుమార్ కూడా అంచనా వేయలేకపోవడం వలనే ఇలా జరిగిందని అభిప్రాయపడ్డారు.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…