అల్లు అర్జున్… కేక్ కట్ ఈజీ, అంచనాలు కట్ కష్టం!

సరిగ్గా వారం రోజుల్లో అల్లు అర్జున్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. 44వ ఏట అడుగుపెడుతున్న బన్నీ 22వ చిత్రం మీద భారీ అంచనాలున్నాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దీపిక పదుకొనె హీరోయిన్ అనే విషయం తప్ప, క్యాస్టింగ్ గురించి కానీ, టెక్నికల్ క్రూ గురించి కానీ ఇప్పటివరకు ఒక్క అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు.

గతేడాది జులైలో మొదలైన షూటింగ్ నుండి వీడియో లీక్ అవ్వడం కాదు కదా, కనీసం హీరోహీరోయిన్ల లుక్ కూడా బయటికి రాలేదు. దాంతో అల్లు అర్జున్ 44వ పుట్టినరోజున సినిమాకి సంబంధించిన గ్లింప్స్ లేదా ఏదైనా వీడియో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు అందరూ. కట్ చేస్తే.. వీడియో గ్లింప్స్ కాదు కదా కనీసం సినిమా లుక్స్ కూడా రిలీజ్ అవ్వడం లేదని ఇవాళ కన్ఫర్మ్ చేసారు బన్నీ వాసు.

ADVERTISEMENT

ఓ సినిమా ఈవెంట్ కి హాజరైన బన్నీ వాసు AA22 బర్త్ డే స్పెషల్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. “టైటిల్ రివీల్ చేసే స్కోప్ ఉంది, వీడియో లాంటివి మాత్రం ఎక్స్ పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఇది చాలా స్పెషల్ మూవీ” అని చెప్పుకొచ్చాడు.

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీని ఫారిన్ నుండి ఇండియాకి తీసుకురావడమే కాక, లీకులకి స్కోప్ లేకుండా ముంబైలో ఒక స్పెషల్ సెట్ లో షూట్ చేస్తున్నారు. ఈ సినిమా జోనర్ ఏమిటి? దీపిక కాకుండా సినిమాలో నటిస్తున్న మిగతా నటీనటులు ఎవరు? వంటి డీటెయిల్స్ అన్నీ ఏప్రిల్ 8న రివీల్ అయ్యే అవకాశం ఉంది.

మరి టీమ్ ఇంత జాగ్రత్తపడడానికి కారణం నిజంగానే యాటిసిపేషన్ పెంచడానికా? లేక ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేస్తే, ఎలాంటి అవుట్ పుట్ వస్తుందో, దానికి ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తుందో అనే భయమా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం. మరి ఈ పీక్ లెవల్ హైప్ & క్రేజ్ ను అట్లీ & బన్నీ ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Zombie Reddy 2 1st Look: Upendra Gets Unhinged

Superhero Teja Sajja, who has established a Pan-India presence following HanuMan and Mirai, reunites with…

10 minutes ago

రాజధాని చేయకుండానే విశాఖ అభివృద్ధి.. తలెక్కడ పెట్టుకోవాలి బాబూ?

ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? విశాఖ రాజధాని చేయాలి. కనుక విశాఖ రాజధాని అంటే ఏమిటి? రుషికొండపై…

16 minutes ago