బన్నీకి ఇది ప్లస్సా ? మైనస్సా ?

ఒక చిన్న సినిమాకి ఎవరో ఒకరి స్టార్ సపోర్ట్ ఉండాల్సిందే అని ఫీలవుతుంటారు మేకర్స్. దానికోసం ఫ్యాన్స్ ఉన్న క్రేజీ హీరోని రంగంలోకి దింపుతారు. అయితే ఈ లిస్టు లో చాలా మంది హీరోలు ఉంటారు కానీ క్రేజ్ ఉన్న హీరోనే ఎక్కువగా అప్రోచ్ అవుతుంటారు. ఇప్పుడు బన్నీ ఆ లిస్టు లో ముందు వరుసలో ఉన్నాడు. ‘అల వైకుంఠ పురములో’ మంచి వసూళ్ళు రాబాట్టాడు బన్నీ. దాన్ని కరెక్ట్ గా వాడుకుంటూ పిఆర్ తో గట్టిగా ప్రమోట్ చేసుకున్నాడు. ఎంతలా అంటే బన్నీ ఈవెంట్ కి వస్తే సినిమా రేంజ్ మారిపోద్ది అన్నట్టుగా

నిజానికి అల వైకుంఠపురములో కంటే ముందు బన్నీ చాలానే ఈవెంట్స్ కి వచ్చాడు. కానీ వాటిలో అన్నీ సొంత సినిమాలే. కానీ ఇప్పుడు అలా కాకుండా బయటి సినిమాలు చిన్న సినిమాల ఈవెంట్స్ కి కూడా గెస్ట్ గా వచ్చేస్తూ తన స్పీచ్ హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటివలే ‘వరుడు కావలెను’ సినిమా ఈవెంట్ వచ్చి తన స్పీచ్ తో బాలీవుడ్ లో కూడా టాపిక్ గా మారాడు బన్నీ. తన పిఆర్ టీం కూడా ఈ విషయంలో మాములుగా వర్క్ చేయడం లేదు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ అలాగే కన్నడ ఫిలిం మేకర్స్ కి ఆ స్పీచ్ రీచ్ చేయనికి గట్టిగానే పనిచేశారు.

ADVERTISEMENT

‘పుష్పక విమానం’ అనే సినిమా ట్రైలర్ లాంచ్ కి గెస్ట్ అయ్యాడు బన్నీ. ఇక్కడ విజయ్ దేవరకొండ పర్సనల్ రిక్వెస్ట్ అనుకోవచ్చు లేదా బన్నీ కి ఉన్న క్రేజ్ తో సినిమా జనాలకి ఇంకా రీచ్ అవుతుందని నమ్మకం అయి ఉండొచ్చు. ఏదేమైనా బన్నీ మాత్రం తన క్రేజ్ పెంచుకుంటూ ఓ టాప్ స్టార్ గా రెగ్యులర్ ఈవెంట్స్ కి ఎటెండ్ అవుతూ ఎటెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నాడు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరికొంతమంది స్టార్ హీరో అంటే ఒక స్టేచర్ ఉండాలి. బన్నీ ఇలా అస్తమాట్లు ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటే ఎలా అనుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories