
అయితే నిజంగానే ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’ అన్న ట్యాగ్ లైన్ కు బన్నీ అర్హుడా? ఈ మెగా హీరో నటించిన సినిమాల టీజర్లు, ట్రైలర్లు యూ ట్యూబ్ లో కొత్త రికార్డులు సృష్టించాయా? అంటే… అందరికీ తెలిసిన కాదనే జవాబే వస్తుంది. నిజానికి ఒక్క “దువ్వాడ జగన్నాధమ్” ట్రైలర్ క్లిక్స్ మినహా బన్నీ ఖాతాలో ఏ ఇతర రికార్డులు లేవు. అంతకుముందు బన్నీ నటించిన చిత్రాలకు రికార్డ్ క్లిక్స్ అందుకున్న దాఖలాలు కూడా లేవు.
మరి ఒక్క సినిమా ట్రైలర్ తోనే ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’గా బన్నీ మారిపోతారా? ఇక్కడే ‘చెప్పను బ్రదర్’ ఉదంతం గుర్తుకు వస్తోంది. నిజానికి యూ ట్యూబ్ క్లిక్స్ అన్నా… సోషల్ మీడియా హంగామా అన్నా… అది పవన్ కళ్యాణ్ కే సొంతం అనిపించే విధంగా ఉండేది. సోషల్ మీడియాలో పవన్ కున్న హంగామా మరే ఇతర హీరోకు ఉండేది కాదు. పవన్ తదుపరి స్థానంలో పోటీనిచ్చే విధంగా మహేష్ గురించి సందడి జరిగేది.
వీరిద్దరూ తప్ప ఇతర తెలుగు హీరోలకు ఆ స్థాయి లేదన్నది వాస్తవం. అయితే కాలక్రమేణా పవన్ స్థాయి తగ్గుతూ ఉండడం… మరో వైపు మహేష్ స్థాయి పెరుగుతూ ఉండడం జరిగింది. పాత యూ ట్యూబ్ రికార్డులు వేటిని కదిపినా… వీరిద్దరి పేర్లే కనపడుతుంటాయి తప్ప, మరొకరికి ఆ అవకాశం లేదు. అయితే ఈ లెక్కలను మార్చింది మాత్రం ‘బాహుబలి’ రెండు పార్టులు. ప్రభాస్ నటించిన ఈ సినిమా ట్రైలర్లకు నెటిజన్లు నీరాజనం పలకడంతో, అంతకు ముందు ఉన్న రికార్డులతో పాటు, భవిష్యత్తులో ఎవరూ కొట్టలేని విధంగా రికార్డులను సెట్ చేసారు.
మరి ఆ ఒక్క సినిమాతోనే ప్రభాస్ ను ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’గా పిలిస్తే ఎలా ఉంటుంది? పిచ్చ కామెడీ ఖాయం. ప్రస్తుతం అల్లు అర్జున్ విషయంలోనూ అదే జరుగుతుందని చెప్పాలి. అసలు అర్హులైన పవన్, మహేష్ లు సైలెంట్ గా ఉంటుంటే… లేనిపోని ఇమేజ్ కోసం కొత్త బిరుదులను తగిలించుకోవడం అనేది అత్యుత్సాహాన్ని చిహ్నంగా ఉంటోంది తప్ప, మరొకటి కాదని చెప్పాలి. అయితే ఫేస్ బుక్ లో ఉన్న తెలుగు హీరోలలో అత్యధిక మంది ఫాలోయర్స్ లో అల్లు అర్జున్ నెంబర్ 1 స్థానంలో ఉన్నారు.
ఒకవేళ ఇదే ప్రామాణికం అనుకుంటే… మరోవైపు ట్విట్టర్ లో ప్రిన్స్ అగ్రస్థానంలోనే ఉన్నారు. మరి ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుని అల్లు అర్జున్ ను ‘కింగ్ ఆఫ్ సోషల్ మీడియా’గా దువ్వాడ చిత్ర యూనిట్ అభివర్ణించిందో ఏమో గానీ, ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. బహుశా సోషల్ మీడియాలో ఎక్కువగా హంగామా చేసే పవన్ అభిమానులను మరింత రెట్టించే విధంగా ఈ బిరుదును ఇచ్చారా? నిజంగా బన్నీ దీనికి అర్హుడా? ఎనీ కామెంట్స్..?!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…