
ముందుగా లీక్ చేసినా… అయినా… పాటలోని ఇంపాక్ట్ అయితే ఏం మారలేదు. గణతంత్ర్య దినోత్సవానికి పర్ ఫెక్ట్ సాంగ్ గా ఈ ‘సైనిక్’ పాట నిలుస్తోంది. బోర్డర్ లో ఉన్న జవాన్లందరికీ అంకితం ఇచ్చే విధంగా, వారి గొప్పతనాన్ని కీర్తిస్తూ సాగిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. అలాగే బాలీవుడ్ ద్వయం విశాల్ – శేఖర్ ల సంగీతం తెలుగు నేటివిటీ లేకపోయినా, పాట యూనివర్సల్ కాన్సెప్ట్ కావడంతో సాహిత్యం డామినేట్ చేసి ఆకట్టుకుంటోంది.
‘సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటి నిండా నిదురపోదురా…’ అంటూ ప్రారంభమైన ఈ పాటలో ‘ఓ సైనిక’ అంటూ ఆలపించే విధానం మాంచి ఊపు తెస్తుంది. మొత్తానికి “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా కాన్సెప్ట్ డివియేట్ కాకుండా, సరైన ప్రమోషన్స్ తో ముందుకు వెళ్తున్నారని ఈ పాట చెప్తుంది. ఇప్పటికే టీజర్ లో చూపించిన సన్నివేశాలకు మ్యాచ్ అయ్యే విధంగా ఈ పాట ఉంటుంది.
Dhurandhar has emerged as the biggest winner at the IIFA Awards 2026. Dhurandhar has taken…
The term of the BR Naidu-led Tirumala Tirupati Devasthanams (TTD) governing board has come to…