Telugu

“నా పేరు సూర్య” రిలీజ్ డేట్ లో మార్పు?

ఏప్రిల్ 27వ తేదీన రెండు పెద్ద సినిమాలు “భరత్ అనే నేను” మరియు “నా పేరు సూర్య” విడుదలకు ముహుర్తాలు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత “రోబో 2.0” ప్రకటన చేయడం, ఈ రెండు చిత్రాల నిర్మాతలు ప్రతిస్పందించడం తదితర పరిణామాలతో, ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ లలో మార్పు ఉంటుందేమో అన్న అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఆ తర్వాత కూడా రెండు చిత్రాల నిర్మాతలు ‘తాము ప్రకటించిన తేదీకే విడుదల చేస్తామని’ చెప్పడంతో పోటీ అనివార్యం అని భావించారు.

ADVERTISEMENT

కానీ తాజా ట్రేడ్ టాక్ ప్రకారం అల్లు అర్జున్ “నా పేరు సూర్య” సినిమా రిలీజ్ డేట్ మారుతోందని తెలుస్తోంది. ఏప్రిల్ 27వ తేదీన “భరత్ అనే నేను” విడుదల కావడం తధ్యం కాగా, బన్నీ మూవీ మాత్రం ఏప్రిల్ 13వ తేదీకి మారిందని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ రావచ్చని సమాచారం. అదే జరిగితే నాని “కృష్ణార్జున యుద్ధం”తో తలపడినట్లే. ఇప్పటికే తమ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నాని కూడా ఓ అధికారిక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు మరియు హిందీ శాటిలైట్ హక్కులు కలిపి దాదాపుగా 39 కోట్లకు ప్రముఖ మీడియా ఛానల్ సొంతం చేసుకుందన్న వార్తలతో “భరత్ అనే నేను” పేరు మరోసారి మారుమ్రోగింది. అలాగే ఆడియో హక్కులు కూడా దాదాపుగా 2 కోట్లు పెట్టి లహరి సంస్థ దక్కించుకోవడంతో, కొరటాల – మహేష్ కాంబోపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయని అర్ధమవుతోంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ…

దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…

10 minutes ago

No Assembly But Took 1.24 Cr Salary?

The Telangana political landscape is starting to heat up as Chief Minister Revanth Reddy has…

38 minutes ago