Telugu

బన్నీ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి

చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒక్కసారి యాక్టీవ్ గా అయ్యారు. ఈరోజు ఉదయమే బన్నీ సోషల్ మీడియాలో తన పదిహేను రోజుల హోమ్ క్వారంటైన్ తరువాత కోలుకున్నా అని, తాజా కరోనా టెస్టులో నెగటివ్ అని తేలిందట. మరోవైపు…. పుష్ప గురించి కూడా ఆసక్తికరమైన వార్తలు బయటకు వచ్చాయి.

ADVERTISEMENT

ఆ సినిమా రేపు పార్ట్లు గా తీయడం నిజమేని, ఇంకో ఎక్సట్రా పాట కూడా కలపబోతున్నారని వార్తలు వచ్చాయి. అది ఐటెం సాంగ్ అనేది కూడా కంఫర్మ్ చేశారు. పైగా ఒక పాట, రెండు సీన్ల మినహా మొదటి పార్టు పూర్తి అయ్యిందని, రెండో పార్టులో 10% షూటింగ్ పూర్తి అయ్యిందని తెలవడంతో లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ కు ఇబ్బంది ఉండవని వారు ఒక నిర్ధారణకు వచ్చారు.

పరిస్థితులు చక్కబడితే నెల రోజులలోనే ఫస్ట్ పార్టు రెడీ చెయ్యవచ్చు అని వారు ధీమాగా ఉన్నారు. మరోవైపు… ఐటెం పాట అంటున్నారు కాబట్టి… పైగా పాన్ – ఇండియా సినిమా కాబట్టి ఎవరైనా బాలీవుడ్ హీరోయిన్ తీసుకుని క్రేజ్ పెంచాలని బన్నీకి, నిర్మాతలకు ట్వీట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈరోజు బన్నీ ఫ్యాన్స్ కు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి అనే చెప్పుకోవాలి.

ఇది ఇలా ఉండగా… అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ గురించి అనేక ఊహాగానాలు ఇప్పటినుండే మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్, ఎఆర్ మురుగదాస్ పేర్లు ఇప్పటికే వినిపిస్తున్నాయి. అదే సమయంలో అల్లు అర్జున్, వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణులతో కలిసి వారి ఇదివరకటి సినిమా ‘ఐకాన్‌’ ను పునరుద్ధరించడం గురించి దిల్ రాజు ఇప్పటికే హిట్ ఇచ్చారు

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

How Sai Created BIG Hype for Dhanush That Was Missing?

Recently, the second single from Dhanush's Om, titled Veezha Veera and composed by Sai Abhyankkar,…

23 minutes ago

No Place for Rebels: Chandrababu’s Warning

Andhra Pradesh Chief Minister and TDP chief Chandrababu Naidu has issued a strong warning to…

42 minutes ago