Telugu

అల్లు అవతార్ రేంజ్ అంట!

అల్లు అర్జున్ రాకా ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాల్లో ఒకటి. యావత్ భారతీయ చిత్రసీమ వెయిట్ చేస్తున్న సినిమా ఇది. అలాంటి సినిమాకి సంబంధించి ఇప్పటివరకు అల్లు అర్జున్ ఒన్నాఫ్ ది లుక్ తప్ప మరొక అఫీషియల్ కంటెంట్ అనేది బయటికి రాలేదు. దాంతో ఫ్యాన్స్ నుండి జనరిక్ ఆడియన్స్ వరకు సినిమా కంటెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.

అయితే.. ఇటీవల చెన్నైలో జరిగిన బత్తా అనే తమిళ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో శివకార్తికేయన్ తో “డాన్” అనే సినిమా తెరకెక్కించిన శిబి చక్రవర్తి మాట్లాడుతూ.. “నేను రీసెంట్ గానే రాకా సినిమాలోని కొన్ని విజువల్స్ చూశాను, ఇండియన్ సినిమా చరిత్రలో ఈస్థాయి విజువల్స్ ఇప్పటివరకు ఎవ్వరూ చూడలేదు, చెప్పాలంటే అవతార్ లో కూడా ఈస్థాయి విజువల్స్ లేవు” అంటూ తెగ పొగిడేశాడు. దాంతో ఒక్కసారిగా రాకా మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది.

ADVERTISEMENT

అదే సందర్భంలో మరో మూడు రోజుల్లో రాకా విజువల్స్ అందరూ చూడబోతున్నారు అంటూ శిబి స్టేట్మెంట్ ఇవ్వడం మరో హైలైట్ గా నిలిచింది. సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు, మరి ఆరోజు ఏం విడుదల చేస్తారు? అసలు ఓ స్టార్ హీరో సినిమా టీజర్ అనేది డైరెక్టర్ బర్త్ డేకి రిలీజ్ చేయడం ఇంతకుముందు ఎప్పుడు జరిగింది? అనేది గుర్తు కూడా రావడం లేదు. సందర్భం ఏదైనా మొత్తానికి రాకా విజువల్స్ బయటికి వస్తున్నందుకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.

పుష్ప తర్వాత పాన్ ఇండియా క్రేజ్ ని మరోస్థాయికి తీసుకెళ్తూ రాకా సైన్ చేశాడు బన్నీ, ఈ సినిమాతో ఎలాంటి హిట్టు కొట్టబోతున్నాడు అనేది పక్కన పెడితే, తన చాయిస్ ఆఫ్ ఫిలిమ్స్ తో మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి రాకా టీజర్ లేదా గ్లింప్స్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తెలియదు కానీ.. అవతార్ ని మించి అనే స్టేట్మెంట్ ని రీచ్ అవ్వగలిగితే మాత్రం మాములుగా ఉండదు.

Share
Dheeraj Babu

With over 13 years of experience in the film industry, Dheeraj Babu is a seasoned film journalist and critic known for insightful analysis and a keen eye for cinematic detail. He combines a deep knowledge of film hist…

Published by

Recent Posts

Lust Stories 3 Review: Fresh Yet Uneven Take On Desire

BOTTOM LINE Fresh Yet Uneven Take On Desire PLATFORM Netflix RUNTIME 2 Hours What Is…

17 minutes ago

Most Controversial Modi Biopic: Genuine or Whitewash?

Sajid Nadiadwala’s production house has been dealing with losses for a long time. However, they…

48 minutes ago