
రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులకు లేదా తమపై అనుచిత వ్యాఖ్యలు చేసినవారికి లీగల్ నోటీసులు జారీ చేయడం పరిపాటి. కానీ వైసీపీ రాష్ట్ర డీజీపీకి, జిల్లా ఎస్పీలకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, రిటర్నింగ్ అధికారులకు వైసీపీ లీగల్ సెల్ లీగల్ నోటీసులు జారీ చేసింది!
ఇంతకీ లీగల్ నోటీసులు దేనికంటే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. ఎన్నికల నిబంధనలన్నీ ఖచ్చితంగా పాటించాలి. అభ్యర్థుల నామినేషన్లు దాఖలు మొదలు కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించే వరకు ప్రతి దశలో ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. వాటి ఫుటేజ్ భద్రపరచాలి.
భారీగా భద్రతా దళాలు మోహరించి వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సహకరించాలి. ఎన్నికలు సజావుగా జరిగేలా చేయాలి.
ఎక్కడ ఏ లోపం జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించడంగానే పరిగణించబడుతుంది. కనుక బాధ్యులు చట్టపరంగా చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
అంటే మున్సిపల్, పరిషత్ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగలేదని వాదిస్తున్న వైసీపీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈ సరికొత్త వ్యూహంతో సంబంధిత అధికారులను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది.
గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యవహరించిన తీరును మరిచిపోయినట్లు, ఇప్పుడు రాష్ట్ర డీజీపీకి, జిల్లా ఎస్పీలకు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు, రిటర్నింగ్ అధికారులకు వైసీపీ లీగల్ సెల్ లీగల్ నోటీసులు జారీ చేయడం చాలా విడ్డూరంగా ఉంది కదా?
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కాదు ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వ అధికారులను, ఎన్నికల అధికారులను ఈవిధంగా బెదిరించడం ఇంకా ఆశ్చర్యం!
భారత రాజకీయాల్లో ఇప్పటివరకు ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చినప్పటికీ ఒక 'బొద్దింక' పేరుతో పార్టీ ఏర్పాటు చేయడం, అందునా ఆ…
The anticipation surrounding SS Rajamouli's Varanasi, starring Mahesh Babu, continues to grow. The film is…