అల్లు అర్జున్ నీకు ఇంకా టైమ్ ఉంది… మహేష్ బాబు రేంజ్ ఇది

 Allu Arjun You still have time This is Mahesh Babu Rangeసోషల్ మీడియా యుగంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోల సినిమాలు హిట్ కావడం ఒక ఎత్తు అయితే… సరైన ప్లానింగ్ తో కాంబినేషన్లు సెట్ చెయ్యడం… ప్రతీదీ ఎగ్జిక్యూట్ చేసి మాక్సిమమ్ మైలేజ్, ఫాలోయింగ్ పెంచుకోవడం, మీడియా కవరేజ్ రాబట్టడం ఇలా ఎన్నో ఉంటాయి.

ఇటువంటి ప్లానింగ్ విషయంలో యువ హీరోలలో అల్లు అర్జున్ టాప్ అంటారు. కొందరు అల్లు అర్జున్ కు ఈ విషయంలో దరిదాపులలో కూడా ఎవరు లేరని అంటారు. అయితే అలా అనే వారిని మహేష్ బాబు ఒక్క రోజులో సైలెంట్ చేసేశాడు.

ADVERTISEMENT

సోమవారం మహేష్ బాబు బర్త్ డే హంగామా అంతా ఇంతా కాదు. అర్ధరాత్రి సర్కారు వారి పాట టీజర్ తో మొదలయ్యింది.. ఉదయం సెలబ్రిటీలు అందరూ మహేష్ బాబుని విష్ చెయ్యడంతో సోషల్ మీడియా కోలాహలంగా మారింది.

సాయంత్రం కొంచెం చల్లబడింది అనగానే #SSMB28 చిత్రం ప్రకటనతో మరింత జోష్ నింపారు… ఆ హంగామా తగ్గగానే టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ సెలబ్రిటీ ట్విట్టర్ స్పేస్ హంగామా ఉంది. దానికి సంబంధించిన కోలాహలం అర్ధరాత్రి నుండి మరునాడు వరకు మీడియాలో ఉంటూనే ఉంటుంది.

ఒకరకంగా చెప్పాలంటే ఒక రోజు మొత్తం సోషల్ మీడియాను హైజాక్ చేసిపడేశారు మహేష్ బాబు. అల్లు అర్జున్ నీకు ఇంకా టైమ్ ఉంది… మహేష్ బాబు రేంజ్ ఇది అని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories