
అంతలా చిన్నారులను ఆకట్టుకునే ప్రిన్స్ బుట్టలో అల్లు అర్జున్ తనయుడు అయాన్ కూడా చేరిపోయాడన్న విషయం తాజాగా వైరల్ అవుతోన్న ఓ వీడియో స్పష్టం చేస్తోంది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అల్లు అయాన్ పలికిన చిట్టిపొట్టి మాటల వీడియో సర్క్యూలేట్ అవుతోంది. ఓ వ్యక్తి అడుగుతున్న ప్రశ్నలకు ఆడుకుంటూ అయాన్ బదులిచ్చిన సమాధానాలు ముద్దొచ్చేలా ఉండడంతో, ఈ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటోంది.
ఇంతకీ అల్లు అయాన్ – మహేష్ బాబుకు లింక్ ఎలా ఏర్పడిందో తెలుసా… ముందుగా ఆ వీడియోలో ‘నీ పేరేంటి’ అని అడుగగా, ‘అయాన్’ అని, ‘మీ డాడీ పేరేంటి?’ అంటే ‘అర్జున్’ అని జవాబిస్తాడు. ఇక ‘సైకిల్ తొక్కేటప్పుడు నువ్వు ఎవరు?’ అని అడగగా, తన చిట్టిపొట్టి మాటలతో ‘మహేష్ బాబు’ అని చెప్పడంతో… మెగా కాంపౌండ్ లో ఎంతమంది ఉన్నా, చిన్నారులకు మాత్రం మహేష్ బాబే హీరో అని మరోసారి ప్రూవ్ అయ్యింది.
‘సిసింద్రీ’ అఖిల్ కూడా తన చిన్నతనంలో మహేష్ బాబు పోస్టర్లను తన రూమ్ నిండా అంటించుకునే వారని ఒకానొక సమయంలో నాగార్జున బహిరంగంగానే వెల్లడించారు. ఇంట్లో తాను హీరో అయినా, అఖిల్ హీరో మాత్రం వేరే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. బహుశా అల్లు అర్జున్ కూడా త్వరలో ఇలాగే నాగార్జున బాటలో పయనిస్తూ… చెప్పాల్సిన సమయం వస్తుందేమో చూడాలి..!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…