
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు వైసీపీ గెలుపు కోసం పులివెందుల రోడ్ల మీదకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇందుకు జగన్ నుంచి వైసీపీ శ్రేణుల వరకు అనేక కారణాలు చెప్పుకున్నప్పటికీ జగన్ కి పులివెందులలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ చర్చనీయాంశం.
దశాబ్దాలుగా పులివెందుల రాజకీయాలలో ఏకచక్రాధిపత్యం వహించిన వైఎస్ కుటుంబం ఇప్పుడు తన సొంత కుటుంబ సభ్యురాలి గెలుపు కోసం కూడా ఎందుకింతలా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన ఒంటెద్దుపోకడలే ప్రస్తుత ఈ పరిస్థితులకు కారణాలుగా నిలిచాయా.? అనే ప్రశ్నలకు వైసీపీ జవాబు
వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమయింది అనే సంకేతాలే ఈ ప్రస్తుత పరిణామాలా.?
పులివెందుల స్థానిక ఎన్నికలలో ఓటు వినియోగించుకోవడం కోసం పులివెందుల చేరుకున్న జగన్ అక్కడ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడం లేదని, టీడీపీ అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని, తమ పార్టీ కార్యకర్తలను కనీసం ఎన్నికల పోలింగ్ బూత్ లోకి వెళ్లనివ్వడం లేదని చెప్పి ఆ కారణంగా తానూ పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోవడం లేదంటూ తన ఓటు హక్కుని రీపోలింగ్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నారు జగన్.
అలాగే తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లతో కలిసి పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు నిరసన తెలియచేసారు. అయితే ఒకపక్క ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యే గా ఉన్న జగన్ ఇలా రోడ్ల మీద నిరసన ధర్నాలు చేయడం ఎన్నికల నిబంధలను ఉల్లగించడం కిందకు వస్తుందని పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసారు.
జగన్ తో పాటుగా ఈ నీరసం అకార్యక్రంమలో పాల్గొన్న వైంసః రెడ్డి తో సహా పలువురు వైసీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి. అయితే జగన్ ఇప్పటికే దశాబ్దాలుగా అక్రమాస్తుల కేసులను మోస్తున్నారు, ఇది కేసులను వెనకేసుకున్నారు, ఇక ఇప్పుడు తాజగా ఎన్నికల నిమ్బడల ఉల్లంఘన కేసును ఎదుర్కుంటున్నారు.
అలాగే ఇటు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సైతం వివేకా హత్య కేసు విచారణను ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు జగన్ తో పాటుగా ఎన్నికల నింబంధల ఉల్లంఘన కేసును నెత్తినేసుకున్నారు.
The IT sector has been one of the biggest contributor for the Indian economy over…
Keerthy Suresh has been experimenting with different subjects and genres on the big screen, but…