ఏం చెప్పబోయి… ఏం చెప్పారు… ఈ మెగా హీరో!

Allu tweet on naku srimastu subhamastuమెగా వృక్షం క్రింద ‘గౌరవం’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్, తర్వాత ‘కొత్తజంట’గా పర్వాలేదనిపించే ప్రయత్నం చేసారు. అయితే సాధారణ ప్రేక్షకుల సంగతి పక్కన పెడితే, కనీసం మెగా అభిమానులను కూడా మెప్పించలేకపోయిన శిరీష్ కాస్త విరామం తీసుకున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఈ అల్లు వారబ్బాయి ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ పట్ల మెగా ఫ్యాన్స్ కన్ ఫ్యూజన్ లో పడ్డారు. నిజానికి కన్ ఫ్యూజ్ చేయడానికే అల్లు శిరీష్ ఈ ట్వీట్ చేసినట్లుగా కనపడుతోంది. “త్వరలో నాకు శ్రీమస్తు శుభమస్తు… మీ అందరి ఆశీర్వాదాలు నాకు కావాలి… మిగతా వివరాలు అతి త్వరలో… మీ శిరి…” అంటూ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

ADVERTISEMENT

ఇది అల్లు శిరీష్ కు సంబంధించిన కొత్త సినిమా టైటిల్ కావచ్చని పలువురు అభిప్రాయ పడుతుంటే, మరికొందరు మాత్రం అల్లు వారింట పెళ్లి భాజాలు మ్రోగనున్నాయని అంటున్నారు. పరశురామ్ డైరెక్షన్‌లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా టైటిలా? లేక వివాహ మహోత్సవానికి సంకేతాలా? అతి త్వరలోనే… అన్నారుగా… వెయిట్ చేస్తే… పోలా..!

ADVERTISEMENT
Latest Stories