
“యాభై ఐదు లక్షల పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాం. దానిని కూడా అడ్డుకున్నారు. పేదలకు చోటు లేని చోట ప్రజాప్రతినిధులు కూర్చుని శాసనాలు చెయ్యడం భావ్యం కాదు,” అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. అదే ప్రాంతానికి చెందిన మంత్రితో అమరావతి కన్ను పొడవాలని చూడటం దారుణం అంటున్నారు రైతులు.
ప్రభుత్వం వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన నాటి నుండీ అడుగు ముందుకు పడకుండా చేస్తున్నారు. ఈ విషయం ప్రస్తుతం కోర్టులలో పెండింగ్ ఉంది. వీలైనంత తొందరగా విశాఖపట్నంకు తరలి వెళ్ళాలి అనుకుంటున్న ప్రభుత్వానికి ఇది మింగుడుపడటం లేదు.
దీనితో ఇప్పటికైనా పట్టువదలకపోతే… ఈ మాత్రం కూడా మీకు దక్కదు అంటూ ఈ ప్రకటన ద్వారా బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కనిపిస్తుంది అంటూ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై రైతులు ఎలా స్పందిస్తారో చూడాలి. కోర్టు కేసులు వెనక్కు తీసుకుని ప్రభుత్వానికి సహకరిస్తారేమో చూడాలి.
పాలకులు అవినీతికి పాల్పడుతుంటే ఆ దేశం, రాష్ట్రాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతుంటారు. అదే.. రాజకీయ పార్టీలు నైతిక విలువలు వదిలేస్తే,…
Social media is breeding ground for trolls and wild stuff and it has been the…