Telugu

వర్షం పడితే అమరావతి గురించే.. మౌనమే సమాధానమా?

పొత్తులు పెట్టుకొని కలిసి పనిచేస్తున్న రాజకీయ పార్టీల మధ్యే విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అదే.. అధికార, ప్రతిపక్ష పార్టీలైతే ప్రతీ ఆలోచన, మాట, అంశం, విధానంపై విభేదించుకుంటూనే ఉంటాయి.

ప్రభుత్వం ఏం చేసినా, చేస్తున్నా దానిని తప్పు పడుతూ భారీగా అవినీతి, అక్రమాలు చేస్తోందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉంటాయి. అధికార పార్టీ వాటిపై విరుచుకు పడుతూనే ఉంటుంది.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌లో ఇదే జరుగుతోంది. డీఎస్సీ మొదలు అమరావతి వరకు ప్రతీది తప్పు పడుతూనే ఉంది వైసీపీ. ఆ పేరుతో రాజకీయాలు చేస్తూనే ఉంది.

ఇప్పుడు రాజకీయ పార్టీలు సొంత మీడియాతో పాటు సోషల్ మీడియా వారియర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. వారియర్స్ అని ముందే నామకరణం చేసినందున వారు తమ యజమానుల తరపున ఓ ప్రతిపక్ష పార్టీలాగే ప్రభుత్వంతో తలపడుతుంటారు. కనుక ప్రజలకు ఏది నిజం? ఏది అబద్దం? అని తెలుసుకునే అవకాశం క్రమంగా తగ్గిపోతోంది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెట్టి కొందరు వైరల్ చేస్తున్నారు.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమరావతిని వ్యతిరేకిస్తున్నారు కనుక అయన ముఖ్యమంత్రి అయినప్పుడు దానిని నిర్దాక్షిణ్యంగా పాడుబెట్టేశారు.

ఒకవేళ దాని నిర్మాణ పనులు కొనసాగించి పూర్తిచేసినా లేదా మూడు రాజదానులో, విశాఖ రాజదానో ఏర్పాటు చేసిన నేడు ఇలాంటి చర్చలు, విమర్శలు ప్రతివిమర్శలు వినిపించేవి కావు.

కానీ ఆయన ఏమీ చేయకపోవడంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ సిఎంగా బాధ్యతలు చేపట్టగానే అమరావతి నిర్మాణ పనులు జోరుగా చేయిస్తున్నారు.

కనుక మళ్ళీ అమరావతికి వ్యతిరేకంగా దుష్ప్రచారం మొదలైపోయింది. మొన్నటివరకు ‘కరువు’ గురించి మాట్లాడినవారే, ఇప్పుడు ‘అమరావతి మునిగిపోయిందంటూ’ దుష్ప్రచారం చేస్తున్నారు. వారి దృష్టిలో రాష్ట్రంలో ఎక్కడ వర్షం పడినా ముందు అమరావతే మునిగిపోతుందన్నట్లుంది.

అయితే కూటమి పార్టీల తరపు కానీ, ప్రభుత్వం తరపు నుంచి గానీ, ఎవరూ దీనిని ధీటుగా తిప్పి కొట్టకపోవడంతో, ఈ దుష్ప్రచారమే నిజమని ఇతర జిల్లాల ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం మౌనం వెనుక బలమైన కారణం ఉంటే ఉండొచ్చు. కానీ దాని మౌనం అర్ధాంగీకారమని ప్రజలు నమ్మితే?

కనుక అమరావతి నిర్మిస్తే సరిపోదు. దాని పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉండాలి. అమరావతి తాజా ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రజలతో పంచుకుంటూ ఈ దుష్ప్రచారాలకు చెక్ పెట్టడం చాలా అవసరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Dancers Union Row: Satya Master’s ‘Mansion’ Remark Turns Heads

The Telugu dancers union dispute has taken another turn, with Satya Master now openly questioning…

1 hour ago

That’s Why Sandeep Is a Mile Ahead!

In the film industry, getting the first chance and scoring a success itself is a…

2 hours ago