
రాజధాని లేని రాష్ట్రంగా విభజిత ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాటి నుంచి ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొంటు, మరెన్నో రాజకీయ కుట్రలను తట్టుకుంటూ చిట్టచివరికి నేడు అమరావతి స్థిరమైన, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పట్టాభిషేకం అందుకుంది.
అయితే దేశంలోనే ఈ 20 వ దశాబ్దపు తొలి ఆవిష్కరణ నగరం అమరావతి కావడం ఒక విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటి వరకు దేశంలో అనేక రాష్ట్రాలకు రాజధానులు ఉన్నప్పటికీ ఆ రాజధాని నగరాలన్నీ కొత్తగా రూపకల్పన గావించిన ప్రాంతాలు కావు.
ఉదాహరణకు హైద్రాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూర్ కానీ ఇలా ఆయా రాష్ట్రాల రాజధానులు, రాజధాని కాకమునుపే ఆ ప్రాంతాలు కొంత అభివృద్ధి బాట పట్టాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధానిగా ఆవిష్కరించబడిన అమరావతి మాత్రం రాజధాని అని ప్రకటించక పూర్వం ఈ నగరం గురించి ఎవరికీ పెద్దగా పరిచయం లేదు.
నవ నగరాలుగా రూపకల్పన చేయబడుతున్న అమరావతి నేడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది.
వీటిలో కొన్ని…ఆంధ్రప్రదేశ్ శాసన సభ నిర్మాణం, హై కోర్ట్, సచివాలయం, HOD టవర్స్, అమరావతి ట్రక్ మౌలిక సదుపాయాల, అమరావతి వరద నివారణ పనుల శంకుస్థాపన, అమరావతి ల్యాండ్ పూలింగ్ మౌలిక సదుపాయాల, అమరావతి గృహ, భవన ప్రాజెక్టులు, రోడ్డు రవాణా, రైల్వే లైన్ల సదుపాయాలు ఇలా అనేకానేక కార్యక్రమాలకు మోడీ శంకుస్తావున్నా చేసారు.
నూతనంగా నిర్మించబడుతున్న ఈ నవ నగరాలు అత్యంత ఆధునిక టెక్నాలజీ తో, సరికొత్త హంగులతో, భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా రానున్న మూడేళ్ళలో ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులోకి రానున్నాయి అంటూ సీఎం బాబు ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు.
దుర్గమ్మ ఆశీస్సులతో, పానకాల స్వామి దీవెనలతో, అమరలింగేశ్వరుడి కరుణా కటాక్షంతో, కృష్ణమ్మ సోయగాలతో, 29 వేల రైతు కుటుంబాల త్యాగాలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర నాయకత్వ విజనరీ తో, 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవంగా అమరావతి ఆంధ్రుల జీవితాలలో వెలుగులు విరజిమ్మాలని M9 తరుపున శుభాకంక్షాలు.
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…
Rashmika Mandanna’s absence from the Ranabaali trailer launch became one of the talking points of…