Telugu

అమరావతిలో భూములు కొనుగోలుకు ఇప్పుడే మంచి అవకాశం?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కనుక ఎక్కడ చూసినా నిర్మాణ సంస్థల కార్మికులు, వాటి వాహనాలు, యంత్ర పరికరాలే కనిపిస్తున్నాయి.

అంటే రాజధాని నిర్మాణాలు పూర్తయ్యే వరకు అక్కడ సామాన్య ప్రజలు ఉండేందుకు అవకాశం లేదా? అంటే రాజధాని ప్రాంతంలో 25 గ్రామాలలో దాదాపు లక్షన్నర మంది నివసిస్తున్నారు.

ADVERTISEMENT

మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మరో 2.5 లక్షల మంది నివసిస్తున్నారు. కనుక పాత లెక్కల ప్రకారం చూసినా అమరావతి నగర పరిధిలో సుమారు 4 లక్షల మందిపైనే జనాభా ఉన్నట్లు చెప్పుకోవచ్చు.

అమరావతిలో ప్రభుత్వ భవనాలు కాకుండా అనేక ప్రైవేట్ సంస్థల కార్యాలయాలు కూడా నిర్మితమవుతున్నాయి. వాటిలో నిర్మాణం పూర్తి చేసుకున్న వాటిలో వీలైనంత త్వరగా కార్యకలాపాలు మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కార్యకలాపాలు మొదలుపెట్టి ఉద్యోగుల రాకపోకలు మొదలైతే రాజధాని అమరావతికి కొత్త కళ వస్తుంది. ముఖ్యంగా వాటి నుంచి పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది.

వచ్చే ఎన్నికల నాటికి అమరావతిలో అన్ని ప్రధాన భవనాలు, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు పూర్తవుతాయని మంత్రి నారాయణ ముందే చెప్పారు.

కనుక రాబోయే 4-5 సంవత్సరాల్లో అమరావతిలో జనాభా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కనుక అందుకు తగ్గట్టుగా రాజధాని పరిధిలో రియల్ ఎస్టేట్ సంస్థలు ఇప్పటికే అనేక చోట్ల వెంచర్లు వేసి నివాస సముదాయాల నిర్మిస్తున్నాయి.

అయితే అమరావతి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్‌లో దాని అభివృద్ధి దృష్ట్యా డిమాండ్ పెరిగింది. కనుక అప్పుడే భూముల ధరలు శరవేగంగా పెరిగిపోతున్నాయి.

తాజా సమాచారం ప్రకారం నెక్కల్లులో చ.గజం ధర రూ.22-53,000 వరకు ఉండగా, తుళ్ళూరు, మందడం, రాయపూడి, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాలలో రూ.35-66,000 వరకు ఉన్నట్లు సమాచారం. నేలపాడులో అత్యధికంగా గజం ధర రూ.75,000 వరకు పలుకుతోంది.

తెలంగాణ ఏర్పడక మునుపు హైదరాబాద్‌, చుట్టుపక్కల జిల్లాలలో చాలా చౌకగా భూములు, ఇళ్ళ ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులోనే ఉండేవి. కానీ ఇప్పుడు గజం ధర లక్షల్లో, అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ ధర కనీసం కోటి రూపాయలు పలుకుతోంది.

హైదరాబాద్‌తో పోలిస్తే అమరావతి సకల హంగులతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మితమవుతోంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ ఉంటే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కాబోతోంది.

కనుక భవిష్యత్‌లో అమరావతిలో భూములు, ఇళ్ళ ధరలు హైదరాబాద్‌ కంటే చాలా భారీగా పెరిగిపోవచ్చు. కనుక అవకాశం ఉన్నవారు ఇప్పుడే అమరావతిలో భూములు, ఇళ్ళు కొనుగోలు చేసుకోవడం మంచిది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Tharun Bhascker: Genuine Fire or Venkatesh Maha Repeat?

A few years ago, filmmaker Venkatesh Maha questioned the quality of commercial mass films and…

5 minutes ago

Three Generations, One Frame: Allu Family’s Special Moment

A family dinner in Sri Lanka has brought three generations of the Allu family together.…

20 minutes ago