
అత్యధికులు ఎంపిక చేసిన డిజైన్లను ఒకే చేసి, టెండర్లు పిలిచి నిర్మాణం చేపట్టాలని సీఆర్డీఏ అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. సీఆర్డీఏ పరిధిలో వెయ్యి అపార్టుమెంట్లను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, ప్రజలకు విక్రయించనుందన్నారు.
ఈ సమావేశంలో సిటీ కోర్టు నిర్మాణానికి 12 డిజైన్లు, ఐటీ టవర్ కోసం 19 డిజైన్లను సిద్ధం చేశామని చెప్పారు. ఈ నెల 22 నుంచి వీటిని ఆన్ లైన్ లో చూసుకోవచ్చని, ఇప్పటివరకూ దాదాపు 3 వేల మందికి పైగా వీటిని చూశారని, మరో రెండు రోజులు వీటిని తిలకించవచ్చని తెలిపారు.
ఆపై ఎక్కువ మందికి నచ్చిన డిజైన్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి, తుది మోడల్ ను ఖరారు చేస్తామని నారాయణ తెలిపారు.అమరావతి రాజధాని పరిధిలో వేగవంతంగా గృహ నిర్మాణాలు ప్రారంభం కావడానికి రాష్ట్ర ప్రభుత్వమే వెయ్యి అపార్టుమెంట్లను సొంతంగా నిర్మించనుందని తెలిపారు.
ఈ అపార్టుమెంట్లను 2, 3 బెడ్ రూమ్ లుగా నిర్మిస్తామని, ఆపై ప్రజలకు వేలం పద్ధతిలో విక్రయిస్తామన్నారు. వెయ్యి అపార్టుమెంట్ల నిర్మాణంతో పాటే అక్కడే ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మార్కెట్ ఏర్పాటవుతాయన్నారు. నయా రాయపూర్, గాంధీనగర్, చండీఘడ్ రాజధాని నిర్మాణ సమయంలో అక్కడి ప్రభుత్వాలు ఇటువంటి ఫార్ములానే పాటించాయని గుర్తు చేశారు.
ఐఏఎస్, ఐపీఎస్, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోసం చేపట్టిన 3,840 అపార్టుమెంట్లనిర్మాణాలు వేగంగా సాగుతున్నాయన్నారు. విజయవాడలో ఉన్న కాలువల పక్కన చేపట్టిన గ్రీనరీని రెండు నెలల్లో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని నారాయణ తెలిపారు.
After a long wait, Mirzapur The Movie is arriving on the big screen on September…
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…