
దాదాపుగా 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న అమరావతి – అనంతపురం ఎక్స్ ప్రెస్ వే దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ రహదారి కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు… 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారిలో 185.4 కిలోమీటర్లలో మేర నాలుగు వరుసలు, 208.19 కిలోమీటర్ల పొడవులో ఆరు వరుసలుగా నిర్మించనున్నట్టు తెలిపారు.
అలాగే విజయవాడ – మచిలీపట్నం మధ్య 64.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 740.70 కోట్లు ఖర్చవుతుందని, విజయవాడ బెంజిసర్కిల్ వద్ద 618 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌కు సంబంధించి డిజైన్లు సిద్ధమయ్యాయని, భోగాపురం-భీమిలి, విశాఖపట్టణం-భీమిలి మధ్య నిర్మించనున్న బీచ్ రహదారులతో జాతీయ రహదారులను కలపడం ద్వారా “సౌందర్యమాల” ప్రాజెక్టు సాకారం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…