
ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 18వ తేదీ (రక్షాబంధన్) నాటికి ముగియాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో లక్షలాది మంది శివలింగాన్ని దర్శించుకుంటారు. అయితే ఈ నెల 8న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ తో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైంది. దీంతో యాత్ర పలు సందర్భాల్లో రద్దయింది. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శివలింగాన్ని ఈ ఏడు కేవలం లక్షా 45 వేల మంది మాత్రమే దర్శించుకున్నట్టు సమాచారం.
బిజ్ బెహరా సమీపంలోని జమ్మూ-శ్రీనగర్ హైవేపై గత బుధవారం 20 మంది అమర్‌నాథ్ యాత్రికులు గాయపడ్డారని తెలియగానే స్థానిక ముస్లింలు కర్ఫ్యూ ఆంక్షలను ఉల్లంఘించి, ప్రాణాలకు తెగించి ప్రైవేటు వాహనాల్లో వారిని ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే మంచు లింగం కరిగిపోయినప్పటికీ యాత్రను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం.
ఈ వారం తెలుగు, ఇతర భాషలు కలిపి దాదాపు అరడజను సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సంఖ్య బాగానే ఉన్నా, ఒక్క…
Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…