Telugu

బాబు కి ధైర్యం ఉంది…జగన్ కి దమ్ముందా.?

రాష్ట్రంలో టీడీపీ – వైసీపీ మధ్య కాకరేపుతున్న అంబటి వ్యవహారం లో ముఖ్యమంత్రిగా, టీడీపీ పార్టీ అధినేతగా చంద్రబాబు పెద్దమనసుతో ఒక అడుగు ముందుకేశారు. తన పై అంబటి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను టీడీపీ శ్రేణుల నుంచి వచ్చిన ప్రతి స్పందన పై బాబు స్పందించారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలు కాస్త సంయమనం పాటించాలని, వైసీపీ నేతలు తాము చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా టీడీపీ పార్టీ శ్రేణులను రెచ్చకొట్టేలా మాట్లాడుతున్నారని, వైసీపీ రాజకీయ ఉచ్చులో తెలుగు తమ్ముళ్లు చిక్కుకోవద్దంటూ వారి పార్టీ క్యాడర్ ని లీడర్లను వెనక్కి తగ్గమంటూ బాబు ముందుకొచ్చారు.

ADVERTISEMENT

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్య తేవాలని వైసీపీ ఈ రకమైన బూతు రాజకీయాలను ఎంచుకుని టీడీపీ వారిని రెచ్చకొడుతుంది, ఆ ట్రాప్ లోకి టీడీపీ శ్రేణులు వెళ్లొద్దు, మన పార్టీ క్రమశిక్షణకు మారుపేరు, రాష్ట్రం అభివృధి దిశగా అడుగులేస్తున్న ఈ తరుణంలో వైసీపీ తన రాజకీయంతో ఇలా విధ్వంశం వైపు దారి మళ్లించాలని చూస్తుంది,

అందుకే వైసీపీ ఇటువంటి నీచ రాజకీయాలను ప్రోత్సహిస్తుంది, టీడీపీ నేతలెవ్వరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడొద్దు, హింస, అవినీతి, విధ్వంశం తో వైసీపీ పురుడు పోసుకుంది, ఆ బాటలోకి టీడీపీ ఎప్పటికి వెళ్ళదు, ఎవరు వెళ్లొద్దు అంటూ ఒక పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ‘ధైర్యం’గా ముందుకొచ్చి తన పార్టీ శ్రేణులను వెనక్కి తగ్గేలా ఆదేశాలిచ్చారు.

మరి తన పార్టీ నేతలు మాట్లాడుతున్న బూతులు, వారు చేస్తున్న రెచ్చకొట్టే చర్యలను ఖండించేందుకు వైసీపీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా వైస్ జగన్ కు’దమ్ముందా’.? రాజకీయ హద్దులను చెరిపేసి, విచక్షణ అనే గుణాన్ని వదిలేసి రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాన్ని వద్దు అంటూ వారించేందుకు జగన్ ముందుకురాగలరా.? వైసీపీ శ్రేణులను వెనక్కి తీసుకెళ్లగలరా.?

నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలానే దాడులను తప్పేముంది, మా పార్టీ శ్రేణులకు బీపీలోస్తే ఇలానే ప్రత్యర్థి పార్టీ కార్యాలయాల మీద నుంచి పార్టీ క్యాడర్ వరకు అందరి మీద దాడులతో తెగబడతారు అంటూ హింసను వెనకేసుకొచ్చి ఆ హింసకు పాల్పడుతున్న వారిని సమర్ధించారు.

కానీ నేడు బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయినట్టు టీడీపీ అధికారంలోకి వచ్చింది, వైసీపీ చివరికి ప్రతిపక్షాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. నాడు మా పార్టీ నేతలకు బీపిలొచ్చాయి అంటూ వైసీపీ చర్యలను జగన్ కప్పిపుచ్చుకున్నారు, కానీ నేడు బాబు చట్టాన్ని చేతులలోకి తీసుకోవద్దు, ఇటువంటి దాడులకు పాల్పడవద్దు అంటూ పార్టీ శ్రేణుల బీపీలకు తన ఆదేశాలతో మాత్రలు వేస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.

ఇదే అనుభవానికి – ఆవేశానికి ఉన్న తేడా, ఇదే అభివృద్ధికి – అరాచకానికి ఉన్న వ్యత్యాసం, ఇదే నిర్మాణానికి – కూల్చివేతకు మధ్య ఉన్న అంతరం, ఇదే రాజీకి – రప్ప రప్ప కి ఉన్న వైవిధ్యం, చివరిగా ఇదే వైసీపీ – టీడీపీ కి మధ్య కనిపించే తేడా, బాబు కి జగన్ కి మధ్య ఉండే బేధం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mouli’s Donga Naa Koduku Gets Release Date

Mouli has become a familiar name through his social media work, web series and Little…

9 minutes ago

Venkatesh Maha’s Attahaasam Set for Summer 2027

Venkatesh Maha is returning with his next film Attahaasam. The film is set in the…

28 minutes ago