Telugu

ఏపీ పోలీసులతో కాదు.. ఈడీతో ఆడొచ్చుగా?

ఒకప్పుడు రాజకీయ నాయకులు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ స్ఫూర్తితో.. “నా చివరి రక్తపు బొట్టు వరకు..” అనే డైలాగ్ చెప్పేవారు.

కానీ ఇప్పుడు “నేను ఈ కేసులకు, జైలుకు భయపడను” అనే డైలాగ్ ఎక్కువగా వినిపిస్తోంది. ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమనే స్థాయి నుంచి కేసుల్లో జైలుకి వెళ్లడానికి భయపడనని చెప్పుకోవడం.. కాలంతో పాటు రాజకీయాల్లో వచ్చిన మార్పుకు నిదర్శనమే కదా?

ADVERTISEMENT

ఇంతకీ విషయం ఏమిటంటే.. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు ఏపీ రాజకీయాల్లో కాస్త దూకుడుగానే వ్యవహరిస్తుంటారు. ఆ శైలితో ‘టైగర్ రాంబాబు’గా పేరు తెచ్చుకున్నారు.

తనపై నమోదైన కేసులు, వాటి విచారణల సందర్భంలో ఆయన తరచూ ఇలాంటి డైలాగ్ చెబుతుంటారు. తాజాగా మద్యం రవాణాకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ వరుసగా నోటీసులు పంపుతుంటే.. వాటికి మాత్రం లీగల్ పద్ధతిలోనే స్పందిస్తున్నారు.

ఎందువల్లనంటే.. రాష్ట్ర స్థాయి పోలీసుల వరకు ‘కేసులు, జైలుకు భయపడను’ వంటి డైలాగులతో రక్తి కట్టించవచ్చు. కానీ ఈడీ దగ్గర మాత్రం వ్యవహారం కాస్త డిఫరెంట్.

ఇలాంటి డైలాగులు వికటించే అవకాశం ఎక్కువట! బహుశా అందువల్లే రొటీన్ డైలాగుల బదులు.. “లిఖితపూర్వకంగా నోటీసు ఇస్తే వస్తా.. లేదా ఆరోగ్య కారణాల వల్ల రాలేను..” అంటూ లీగల్ పద్ధతిలో జవాబులు ఇస్తున్నారేమో!

అయితే ఈడీ కూడా తగ్గేలా కనిపించడం లేదు. ఆరోగ్య కారణాలతో సెప్టెంబర్ 24న విచారణకు హాజరు కాలేకపోయిన నేపథ్యంలో.. వెంటనే 28న విచారణకు హాజరు కావాలని మరో నోటీసు పంపింది. కనుక అంబటి రాంబాబు ఆ రోజు కూడా విచారణకు హాజరవుతారా? లేక ఈడీని ఎదుర్కొని టైగర్ రాంబాబుగా తనను తాను ఆవిష్కరించుకుంటారా? చూడాలి.

ఏపీ పోలీసులను “కాకీ డ్రస్ వేసుకున్న మీకు సిగ్గుశరం ఉందా?” అని ధైర్యంగా అడగగలిగారు. కానీ ఈడీ అధికారులను ఉద్దేశించి అలా మాట్లాడితే మాత్రం వ్యవహారం మరోలా ఉండొచ్చు. కనుక ఈడీ విచారణకు హాజరు కావాలంటేనే చాలా గుండె ధైర్యం కావాలి. ఆ తర్వాత ఈడీ అధికారుల ముందు కూర్చొని.. ఈ కేసుకు సంబంధించి సమాధానాలు చెప్పడానికి ఇంకా ధైర్యం కావాలి.

కానీ అంబటి రాంబాబు ఈడీ విచారణకు హాజరై బలంగా తన వాదనలు వినిపించగలిగితే.. ఆ తర్వాత “ఈడీ అధికారులను కూడా గడగడలాడించేశా” అని చెప్పుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది. మరి అంబటి రాంబాబుతోనే సరిపెట్టుకుంటారో.. లేక టైగర్ రాంబాబుగా గుర్తింపు సంపాదించుకుంటారో? చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Nani’s First Reaction After The Paradise Release

Nani's The Paradise has released to a strong reception, setting a Day 1 record for…

11 minutes ago

Why Blood Alone Cannot Make a Mass Moment

A hero covered in blood can create whistles. But blood alone cannot create a mass…

16 minutes ago