Telugu

వైసీపీ 2.0 లో అంబటి హోమ్ మంత్రి అంట….

ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న చందాన కనిపిస్తున్నాయి వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటనలు. ఒకపక్క తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కొన్ని కొన్ని ప్రాంతాలలో వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ముందుకు రాని పరిస్థితి.

మరోపక్క పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేసినా గెలుపు పై నమ్మకం లేని దుస్థితి. ఇటువంటి తరుణంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు రాబోయే వైసీపీ ప్రభుత్వంలో కాబోయే హోమ్ మంత్రి తానే అంటూ స్వీయ ప్రకటనలు చేసుకుంటున్నారు.

ADVERTISEMENT

గుంటూరు వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న అంబటి రాంబాబు తన నియోజకవర్గం నుంచి వైసీపీ మేయర్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ ర్యాలీ తో బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో పోలీసులు అంబటిని అడ్డుకోవడంతో తనను అడ్డుకున్న పోలీస్ అధికారులను ఉద్దేశించి రాంబాబు రాబోయేది వైసీపీ ప్రభుత్వమే అని, ఆ ప్రభుత్వంలో మొదటి ఆరు నెలలు తానే హోమ్ మంత్రినంటూ ప్రకటించుకున్నారు.

దీనితో ఆ ప్రాంగణంలో నవ్వులు విరబూశాయి. ఏపీలో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మొదలుకుని ఆ పార్టీ లోని నాయకులు, కార్యకర్తలు కళ్ళు మూసుకుని ఎదురుచూస్తున్నారు. అయితే వైసీపీ ఊహించినట్టే ఏపీలో జగన్ 2.0 అధికారంలోకి వస్తే సీఎం జగన్ హోమ్ మంత్రిగా అంబటి రాంబాబు కంటున్న కలలను నెరవేర్చుకునే అవకాశం కల్పిస్తారా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

TV Premiere: More Work for Producers, Less Money?

A film's journey doesn't end with its theatrical run. Before it reaches television, it may…

15 minutes ago

Why So Much Hate On Anirudh Love Life Suddenly?

Anirudh Ravichander is reportedly preparing to marry Kavya Maran in Chennai next month. The composer…

44 minutes ago