
మోడీ అంటే ప్రధాని, రేవంత్ అంటే తెలంగాణ సిఎం, జగన్ అంటే ఏపీ సిఎం, చంద్రబాబు నాయుడు అంటే మాజీ సిఎం అని అందరికీ తెలుసు. కానీ అంబటి రాంబాబు అంటే మంత్రిగా ఎవరికీ గుర్తుకు రారు. సంక్రాంతికి సత్తెనపల్లి రోడ్లపై రికార్డింగ్ డ్యాన్స్ చేసే సంబరాల రాంబాబే గుర్తుకు వస్తారంటే అతిశయోక్తి కాదు.
ఇంకా మరికాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే సుకన్య-అరగంట స్టోరీ అందరికీ గుర్తుకు వస్తుంది తప్ప అంబటి రాంబాబు మంత్రి అనే విషయం ఎవరికీ గుర్తుకు రాదు. అది ప్రజల తప్పు కాదు ఆయన స్వయంకృతమే.
మంత్రిగా ప్రజలలో గుర్తింపు సంపాదించుకోవలసిన అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల గురించి అవహేళనగా సందేశాలు పెడుతూ సోషల్ మీడియాలో మరో రకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. లోకులు కాకులు ఏమైనా అనుకుంటారు. వాటన్నిటినీ పట్టించుకుంటే బ్రతకలేము. కానీ కుటుంబ సభ్యులే వేలెత్తి చూపిస్తే కొట్టి పడేయగలమా?
అంబటి రాంబాబు సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ హటాత్తుగా మీడియాకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఆయన 2016, ఫిబ్రవరి 11న అంబటి రాంబాబు కుమార్తెను వివాహం చేసుకున్నారు. తాజాగా ఆయన విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో అంబటి రాంబాబు గురించి ఏమన్నారంటే, “నేను అంబటి రాంబాబు అల్లుడిని. ఇప్పుడు నేను దానిని మార్చలేను. అది నా దురదృష్టం.
అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. శవాల మీద పేలాలు ఏరుకొనే రకం. రోజూ పొద్దునే నిద్రలేచి దేవుడికి దణ్ణం పెట్టుకునేటప్పుడు ఇలాంటి నీచుడు మొహం ఈరోజు నేను చూడకుండా కాపాడమని కోరుకుంటాను.
నీతి, నిజాయితీ, మంచితనం వంటి మంచి లక్షణాలు లేవు. మనుషులందరిలో ఏవో లోపాలు ఉంటాయి. కానీ ఈయనలో 0.0001 శాతం కూడా మంచి లక్షణాలు లేవు. ఇలాంటి వ్యక్తికి మనం ఓట్లేసి గెలిపిస్తే అలాంటి నీచులను మనమే ప్రోత్సహించిన్నట్లవుతుంది…” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఇప్పటికే వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డి, వదిన భారతి, కజిన్ బ్రదర్ అవినాష్ రెడ్డిలని ఏవిదంగా విమర్శిస్తున్నారో, వారిపై ఎంత తీవ్ర ఆరోపణలు చేస్తున్నారో అందరూ రోజూ వింటూనే ఉన్నారు.
ఇటీవల వైసీపిలో చేరిన ముద్రగడ పద్మనాభం మాట తీరు, వైఖరిని తప్పు పడుతూ ఆయన కుమార్తె క్రాంతి మీడియా ముందుకు వచ్చి తీవ్రంగా ఆక్షేపించారు.
ఇప్పుడు మంత్రి అంబటి రాంబాబు అల్లుడు డాక్టర్ గౌతమ్ తన మావగారు నీచుడు, నికృష్టుడని అంటున్నారు. చూడబోతే వైసీపిలో అందరూ ఇలాంటివారేనా? ఇలాంటివారు కనుకనే వైసీపి బ్యాచ్లో ఉన్నారా?అనే సందేహం కలుగక మానదు. సొంత కుటుంబ సభ్యులే వైసీపి నేతలని ఈవిదంగా వేలెత్తి చూపిస్తున్నా, మేమంతా కడిగిన ఆణిముత్యాలమని, ఎదుట వాళ్ళే దుష్టులు, దుర్మార్గులు, తోడేళ్ళు అని చెప్పుకోవడం వైసీపి నేతలకే చెల్లునేమో?
Andhra Pradesh’s local body elections are becoming an important test for the relationship between Chandrababu…
Yash’s look as Ravana in Nitesh Tiwari’s Ramayana has sparked another debate, with Aarya Babbar…