Telugu

అంబటి డాన్సులు ఓకే.. నోరు విప్పితే బూతులే!

అంబటి రాంబాబుని రాష్ట్ర ప్రజలు ఓ మాజీ మంత్రిగా కంటే ఏటా సంక్రాంతికి సత్తెనపల్లిలో నడిరోడ్డుపై రికార్డింగ్ డాన్స్ చేసే సంబరాల రాంబాబుగానే ఎక్కువ గుర్తుంచుకుంటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తిరుమల కల్తీ నెయ్యి వివాదంపై అధికార, ప్రతిపక్షాల మద్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.

గుంటూరులో ‘కల్తీ నెయ్యి మహా పాపం… నిజం’ అంటూ వెలసిన ఫ్లెక్సీ బ్యానర్లని చించి వేసేందుకు అంబటి రాంబాబు తన అనుచరులను వెంటపెట్టుకొని వచ్చారు. ఒకవేళ టీడీపి శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిపై దాడులు చేసేందుకు కర్రలు కూడా పట్టుకొచ్చారు. ఊహించినట్లే అక్కడకు టీడీపి శ్రేణులు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ADVERTISEMENT

పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అంబటి రాంబాబు అక్కడికి కారులో చేరుకున్నారు. ఆయన రాకతో అక్కడ పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసులు ఆయనకు నచ్చజెప్పి వెనక్కు తిప్పి పంపించేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ఆయన వారిని బూతులు తిడుతూ కారులో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు.

కానీ పోలీసులు అడ్డుకోవడంతో ఈసారి ఆయన సిఎం చంద్రబాబు నాయుడుని నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దమ్ముంటే రమ్మను చంద్రబాబుని అంటూ పోలీసులకు, టీడీపి శ్రేణులకు సవాలు విసిరారు.

వైసీపీ ఎన్నికలలో ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అంబటి రాంబాబుతో సహా వైసీపీ నేతలందరూ సుమారు రెండు మూడు నెలల పాటు భయంతో కలుగులో ఎలుకల్లా ఇళ్ళలో నుంచి కాలు బయటపెట్టలేదు.

కానీ ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడుని పోలీసులు, మీడియా ఎదుట అంబటి రాంబాబు బూతులు తిడుతున్నారంటే తప్పు ఆయనదా? ఇలాంటి నేతల పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్న కూటమి ప్రభుత్వానిదా?అని ఎవరైనా ప్రశ్నిస్తారు.

వైసీపీ నేతలు ఇంతగా రెచ్చిపోతున్నా కూటమి ప్రభుత్వం వారిని కట్టడి చేయలేకపోవడంతో మొదట్లో ఆవేశపడిన టీడీపి శ్రేయోభిలాషులు, మద్దతుదారులు కూడా ఇప్పుడు మౌనంగా ప్రభుత్వ నిశహాయతని చూస్తుండిపోతున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టీడీపి అధికారంలో ఉన్నప్పుడే పరిస్థితి ఈవిధంగా ఉంటే, ఒకవేళ రేపు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే? రప్పారప్పా తప్పదని హెచ్చరిస్తూనే ఉన్నారు కూడా!

చివరిగా ఒక మాట చెప్పుకోవాలి. తిరుమల కల్తీ నెయ్యి విషయంలో తమపై తప్పుదు ప్రచారం చేసి, సిట్ నివేదికతో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందని వైసీపీ గట్టిగా వాదిస్తున్నప్పుడు, ఈ ఫ్లెక్సీ బ్యానర్లు చూసి ఎందుకు ఇంతగా మండిపడుతోంది? ఎందుకు ఇంత ఆందోళన చెందుతోంది? అంటే ఈ వ్యవహారం తమ కొంప ముంచబోతోందని గ్రహించినందునేనా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

One Deepfake, One Big Reality Check for Tollywood

The Janhvi Kapoor deepfake controversy may end up being remembered for something bigger than the…

16 minutes ago

Balayya Is Back, Now Dada Has No Time to Waste

For Dada, the wait is over. Balakrishna is back on the sets, the actor joining…

46 minutes ago