
ఏ రంగంలో అయినా రాణించాలంటే నైపుణ్యత ఎంత అవసరమో, క్రమశిక్షణ కూడా అంతే అవసరం. ఈ ఒక్క లోపమే ఒక పరిపూర్ణమైన క్రికెటర్ గా అంబటి రాయుడుని దూరం చేసింది, టీమిండియా తరపున రాణించే అవకాశాలను చేజార్చుకునేలా చేసింది.
తన క్రికెట్ క్రీడారంగ కెరీర్ ముగిసినా, తన నోటి దురుసుకు ఏ మాత్రం తాళం వేయలేదని, ఐపీఎల్ ఫైనల్ ముగిసిన అనంతరం అంబటి రాయుడు చేసిన తాజా వ్యాఖ్యలే చెప్తున్నాయి.
ఐపీఎల్ ఫైనల్లో విజేతగా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ కు శుభాకాంక్షలు తెలిపిన అంబటి, ఈ జట్టుకు వెన్నుదన్నులా నరేన్, రస్సెల్ తదితరులను ప్రశంసించారు. ఇక్కడితో ఆగిపోతే అందులో అంబటి మార్క్ ఏముంటుంది?
ఆరంజ్ క్యాప్ లు ఐపీఎల్ కప్ గెలిపించదని, బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరు కనీసం 300 పరుగులు సహకారం అందించాలని పరోక్షంగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు విరాట్ కోహ్లీలపై అర్ధం వచ్చేలా వ్యాఖ్యలు చేసారు.
కోల్ కతా జట్టును ప్రశంసించడంలో తప్పులేదు గానీ, అందుకు ఆర్సీబీని గానీ, కోహ్లీలను గానీ విమర్శించడం ఎందుకు? అభిప్రాయం సరైనదైనా దానిని సరిగా చెప్పలేకపోతే ఇలాగే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
నిజానికి అంబటి రాయుడు కెరీర్ తొలినాళ్ళ నుండి అనుసరిస్తున్న విధానం ఇదే. దేశవాళీ క్రికెట్ లోనూ ఇలా దురుసు ప్రవర్తన వలనే క్రమశిక్షణా చర్యలకు గురయ్యారు అంబటి.
ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి, టీమిండియా జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ, వరల్డ్ కప్ ప్రాబబుల్స్ లో స్థానం దక్కించుకోలేకపోయాడు.
వరల్డ్ కప్ ఎంపిక కాకపోవడంతో, సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించి మళ్ళీ విమర్శలకు గురయ్యాడు. జాతీయ స్థాయిలో స్థానం నిలుపుకోవాలంటే నైపుణ్యతతో పాటు కాస్త ఓర్పు, సహనం, నిబద్ధత మరియు క్రమశిక్షణ కూడా చాలా అవసరం అన్న విషయాన్ని ఇప్పటికీ కూడా గుర్తించకపోవడమే అంబటి రాయుడు స్పెషాలిటీగా మిగిలిపోనుంది.
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…
Faith, festivity, and the significance of the divine feminine come together in Amma Kadhili Vacche,…