
భర్త ఇంటి ముందు భార్య నిరసన దీక్ష… మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు దీక్ష…వంటి వార్తలు అందరూ చదివే ఉంటారు.
ఆ మహిళలు ఏ పరిస్థితిలో అటువంటి అంతిమ పోరాటానికి సిద్దపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. తమను మోసగించిన వ్యక్తికి బుద్ధి చెప్పేందుకు లేదా అతను ఎటువంటివాడో సమాజానికి తెలియజేసేందుకు వారు పోరాడితే తప్పకుండా ప్రశంశించాల్సిందే.
కానీ తమను మోసగించి, ఇటువంటి అవమానకరమైన, బాధాకరమైన పరిస్థితిని సృష్టించి తమ జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తితోనే పెళ్ళి లేదా కాపురం చేయాలనుకుంటే అందుకు వారిపై జాలి, బాధ కలుగుతుంది.
సరిగ్గా ఇటువంటి పరిస్థితిలోనే ఉన్నారు అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేయాలనుకునే వారు కూడా. “అమెరికన్స్ తప్ప విదేశీయులు ఎవరూ మాకు అక్కర లేదు. మీరందరూ మాకు భారం. అందరూ మీ దేశాలకు పొండి. ఎవరూ మా దేశానికి రావద్దు. మీ ఎగుమతులు, మీ ఐటి నిపుణులు, మీ ఐటి కంపెనీల సేవలు మాకు అవసరం లేదు.
మీ అంతట మీరు పోకపోయినా లేదా ఏదోలా అమెరికాలో దూరిపోయినా ఏదో వంకతో చేతులకు, కాళ్ళకు బేడీలు వేసి మెడ పట్టుకొని బయటకు గెంటేస్తూనే ఉంటాము. అయినా కూడా మీకు మా దేశంలోనే జీవించాలని తపించిపోతుంటే హెచ్-1బీ వీసా ఫీజు కోసం లక్ష డాలర్లు ఫీజ్ కట్టేసి రండి,” అని ట్రంప్ ప్రభుత్వం నిష్కర్షగా చెపుతోంది.
అయినా కూడా నేటికీ చాలా మంది అమెరికాలో చదువులు, ఉద్యోగాల కోసం అర్రులు చాస్తూనే ఉన్నారు. ఎప్పటికైనా ట్రంప్ కనికరించకపోతారా? లేకుంటే ప్రధాని మోడీ ఆయనని ప్రసన్నం చేసుకొని అమెరికాలోకి దారి చూపకపోతారా?”అని అమెరిక గడప దగ్గర కూర్చొని చాలా మంది ఎదురుచూస్తూనే ఉన్నారు.
పైన పేర్కొన్న భార్య, భర్తలు లేదా ప్రేయసీ-ప్రియుల విషయంలో అటువంటి సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు సమాజంలో సానుభూతి, మద్దతుకి బదులు అవమానాలే ఎదురవుతుంటాయి. కనుక అంతిమ పోరాటం చేసి తమ జీవితాలు చక్కదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు.
కానీ అమెరికా మోజుతో అక్కడ చదువులు, ఉద్యోగాల కోసం ఇటువంటి అవమానాలు, ఛీత్కారాలు భరించాల్సిన అవసరం ఉందా?అంటే లేనే లేదు.
ఈ విషయం గ్రహించినవారు ఇప్పటికే అమెరికా గురించి ఆలోచించడం మానేస్తున్నారు. కుదిరితే వేరే దేశాలకు లేదా భారత్‌లోనే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా డాలర్స్, డాలర్ డ్రీమ్స్ కంటే స్వాభిమానం, ఆత్మగౌరవం చాలా ముఖ్యం కనుక.
ఇప్పుడు అమెరికాతో సహా అనేక అగ్ర దేశాల కంపెనీలు భారత్‌కు తరలివస్తుంటే వాటిలో ఉద్యోగాల కోసం అమెరికా లేదా మరో దేశానికి బయలు దేరడం దేనికి?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…