
[m9ad]
తనకు ఉత్తరాది, దక్షిణాది సినీ రంగంల్లోనూ వేధింపులు ఎదురయ్యాయన్న అమైరా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలోనే హీరోయిన్లపై వేధింపులు ఎక్కువని పేర్కొంది. ఆ హీరోతో ఓ సినిమా చేస్తున్నప్పుడు తనపై అసభ్యకరంగా చేతులు వేసి ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. వెంటనే ఆ విషయాన్ని దర్శకుడితో చెబితే, విషయం తెలిసిన హీరో తనకు అప్పటి నుంచి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది.
షూటింగ్కు ఉదయం 8 గంటలకే రమ్మనేవారని, తీరా రెడీ అయితే, సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు షూట్ చేసేవారని పేర్కొంది. ఓసారి సాయంత్రం వరకు కూర్చోబెట్టి షూట్ చేయకుండానే పేకప్ చెప్పారని వాపోయింది. అప్పటి నుంచి దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం వస్తోందని అమైరా పేర్కొంది. ఓ పెద్ద హీరోకి అల్లుడైన అతడి పేరును బయటపెడితే తన కెరీర్ను సర్వనాశనం చేస్తారన్న భయంతోనే చెప్పడం లేదని అమైరా పేర్కొంది.
కానీ అతడిని మాత్రం వదలబోనని, ఏనాటికైనా అతడిని బయటకు ఈడుస్తానని హెచ్చరించింది. అమైరా ఆరోపణల తర్వాత ఆ పెద్ద హీరో అల్లుడు ఎవరన్న దానిపై టాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తెలుగులో “మనసుకు నచ్చింది, రాజుగాడు” సినిమాలలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ, తమిళంలో ‘అనేగాన్’ అనే సినిమాలో నటించింది. అలాగే ప్రస్తుతం ‘ఊడి ఊడి ఉజహికనుం’ అనే సినిమాలో నటిస్తోంది.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…