Telugu

అయ్యో అనంత బాబు కనీసం పరామర్శకు నోచుకోలేదా?

ఓ హత్య కేసు. బెయిల్ కోసం ఎన్నో ప్రయత్నాలు. హైకోర్టులో ఊరట దక్కలేదు. చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఇది దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కథ.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ హత్య తర్వాత నిందితుడు అనంతబాబు చాలా ఉదార హృదయంతో శవాన్ని మృతుడు తల్లితండ్రులకు డోర్‌ డెలివరీ చేయడమే పెద్ద పొరపాటు అయ్యింది. ఈ హత్యకు అదే పెద్ద సాక్ష్యంగా మారడంతో తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడింది. మద్యలో ఓ సారి బెయిల్‌పై బయటకు వచ్చినా మళ్ళీ ఇదే కేసులో జైలుకు వెళ్ళక తప్పలేదు.

ADVERTISEMENT

అప్పటి నుంచి బెయిల్‌ కోసం అనంత ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ బాబు. కానీ లభించడం లేదు. పైగా ఈ కేసు విచారణను నవంబర్‌ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇంకా టెన్షన్ పెరిగినట్లుంది. కనుక చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది.

బెయిల్‌ కోసం హైకోర్టునే అభ్యర్ధించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఇవ్వడం లేదు కనుకనే సుప్రీంకోర్టుకి వచ్చాడని అతని తరపు న్యాయవాది మొత్తుకున్నా సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.

కనుక ఈ హత్య కేసులో బెయిల్‌ సంగతి దేవుడెరుగు. కనీసం విచారణ పొడిగించే అవకాశం కూడా లేకుండా పోయింది. కనుక ఈ కేసులో తుది తీర్పు ఎప్పుడు వెలువడుతుంది? ఎప్పుడు వెలువడినా ఒకవేళ అనంతబాబును నేరస్తుడుగా హైకోర్టు ధృవీకరించి శిక్ష ఖరారు చేస్తే పరిస్థితి ఏమిటి?

హైకోర్టు తుది తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేసి మరో ఆరు నెలలో ఏడాది లాగించేసినా, అది కూడా హైకోర్టు తీర్పును సమర్ధిస్తే?

కనుక ఇంతకాలం రాజాలా దర్జాగా బ్రతికిన అనంతబాబు, ఇప్పుడు ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ గడపాల్సివస్తోంది.

అనంతబాబుకు బెయిల్‌ దొరకడం లేదు సరే! కనీసం పరామర్శకు కూడా నోచుకోలేదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ మేయర్ అభ్యర్ధి ప్రకటన దూకుడా.. తప్పటడుగా?

స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించిన వైసీపీ, కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తుండటమే విడ్డూరం అనుకుంటే, ఈ ఎన్నికలకు…

10 minutes ago

Longer Films, Two Parts: Is Indian Cinema Going Too Far?

Remember when a 2-hour-20-minute film felt like a proper big-screen experience. But now Things have…

22 minutes ago