
ఒకప్పుడు ఇదే విషయం చాలా సార్లు హాట్ టాపిక్ కాగా, కొంతమంది అయితే అనసూయను మందలించారు. కామెంట్స్ చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు, వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి అంటూ సలహాలు ఇచ్చారు. బహుశా ఈ ప్రభావమో ఏమో గానీ, గడిచిన కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి రచ్చ లేదు.
కానీ లేటెస్ట్ గా అనసూయ కాస్ట్యూమ్స్ పై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించడంతో, మరోసారి అనసూయ ఘాటు సమాధానం ఇచ్చింది. గతేడాది ఆగష్టులో పెట్టిన పోస్ట్ కు నేడు ‘ఇద్దరి పిల్లల తల్లి అయ్యి ఉండి, ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుంటావా, తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు’ అన్న ఓ నెటిజన్ అనసూయ పిక్స్ కు రిప్లై ఇచ్చాడు.
దీంతో ఆగ్రహించిన అనసూయ “దయచేసి మీరు మీ పనిని చూసుకోండి, నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు” అంటూ కాస్త గట్టిగానే సమాధానం ఇచ్చింది. అనసూయ రిప్లై కోసం కూడా కొంతమంది ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారని ఈ ‘జబర్దస్త్’ బ్యూటీకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
రొటీన్ కామెంట్స్ పెడితే అనసూయ స్పందన ఉండదు గనుక, ఈ బ్యూటీ వీక్ నెస్ గా భావించే కాస్ట్యూమ్స్ పై కామెంట్ చేయడం నెటిజన్లకు సర్వసాధారణం. ఈ విషయంలో అనసూయపై కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి. పబ్లిసిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ కు సమాధానాలు ఇస్తుందని గతంలో జరిగిన రచ్చ తెలియనిది కాదు.
హీరోయిన్లకు, యాంకర్లకు ఇలాంటి కామెంట్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. వాటిని ఎవరూ నిరోధించలేరు, ఎవరి విజ్ఞతకు వారిని వదిలేయడం తప్ప! ఇలా రిప్లైలు ఇచ్చుకుంటూ వెళితే, రోజుకు కొన్ని వందల సందేశాలను అనసూయ లాంటి వారు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆత్మాభిమానం ఉండడం మంచిదే, అయితే అల్లరి పాలు అయ్యేలా చేసుకోకూడదు.
The pending enforcement directorate and central bureau of investigation cases against Jagan had been jurisdiction…
2011వ సంవత్సరంలో పుట్టిన పిల్ల లేదా పిల్లాడి వయసు ఇప్పుడు ఎంత అంటే 15 ఏళ్ళు! అని టక్కున సమాధానం…