Telugu

ఆంటీ అంటే కేసులా..? ఇదంతా పబ్లిసిటీ స్టంటా …?

ఆంటీ అనే పదం అంత పెద్ద బూతా…? అంటు ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. విషయానికి వస్తే సోషల్ మీడియాలో అనసూయ తనను ఆంటీ అంటూ సంబోధించిన వారిపై తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ఆంటీ అంటూ తనను అబ్యూస్ చేయొద్దంటూ అనసూయ నెటిజన్ల పై విరుచుకుపడుతుంది. నాలుగు పదుల వయస్సు ఉన్న వారిని ఆంటీ అనకా ఏమనాలో చెప్పాలి…? అంటూ అంతే ఆవేశంగా నెటిజన్లు కూడా అనసూయ పై రివర్స్ ఎటాక్ చేస్తున్నారు.

అయినా అనసూయకు ఇదేమి కొత్త కాదు. ఎప్పుడు ఏదోఒక రకంగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తూనే ఉంటుంది. తనను తానూ లైవ్ లైట్ లో ఉంచుకోవడానికి ఇటువంటి అనవసరపు చర్చలకు అనసూయ ప్రాధాన్యం ఇస్తుందనే టాక్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గతంలోనూ ఆమె చెసే షో గురించి, అందులో అనసూయ వాడే భాష గురించి, ఆమె ఉపయోగించే డ్రెస్సింగ్ విధానం పట్ల సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

బుల్లితెరలో జరిగే షోలు ఎక్కువగా కుటుంబం సమేతంగా చూడడానికే ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తారు. కాబట్టే ఇటువంటి షో ల పై.., యాంకర్ల పై ప్రేక్షకుడి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఆంటీ అంటూ తనను ఎవరైనా పిలిచి ఏజ్ షేమ్ చేస్తే వారిపై కేసులు పెడతానంటూ అనసూయ చేస్తున్న ట్వీట్లకు ఆమెకు గట్టి ప్రతిస్పందనే ఎదురవుతుంది.

మీరు యాంకరింగ్ చేసే షోలో వాడే భాష కన్న “ఆంటీ” అనేది పెద్ద బూతా…? టీవీ షోలలో అడల్ట్ కంటెంట్ మీద జోకులు వేస్తే మీకు అభ్యంతరం లేదు కానీ ఆంటీ అంటే మాత్రం తప్పా..? మీ పిల్లల ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆంటీ అంటే వారిపై కూడా ఇదేవిధంగా కేసులు పెడతారా మీరు…? అంటూ రీట్వీట్స్ తో చెలరేగిపోతున్నారు నెటిజన్లు.

ఎవరైనా వారికీ ఉన్న టాలెంట్..,పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుడి దగ్గరవ్వాలని చూడాలి కానీ ఇలా కాంట్రవర్సీ ఆర్గుమెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ లేపుతూ కాదు అంటూ అనసూయకు హితవు పలుకుతున్నారు కొందరు నెటిజన్లు. అనసూయ చేసే యాగీ అంత పబ్లిసిటీ స్టంట్ లో ఒక భాగమే అంటున్నారు మరికొంతమంది. ఏదోరకంగా సోషల్ మీడియాను వాడుకొని సెలబ్రెటీ స్టేటస్ ని పెంచుకోవడంలో ఒక్కొక్కరు ఆరితేరిపోతున్నారు అనేది మాత్రం వాస్తవం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Vishwak’s #CULT Trailer: Thrills n Chills

Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…

10 minutes ago

Spirit Poster Trolls: Deepika Fans Target Vanga Again?

Sandeep Reddy Vanga has postponed Prabhas' Spirit once again, with the film now scheduled to…

57 minutes ago