
దీనిని సమర్ధిస్తూ నాడు రవితో పాటు యాంకరింగ్ చేసిన మహిళా యాంకర్ భగత్ కూడా ఓ వీడియోను విడుదల చేసారు. బెంగుళూరు వెళ్తున్న ఈ యాంకర్ మధ్యలో కారు ఆపి, నిజంగానే అక్కడ సాంకేతిక లోపం ఉందని, ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసారు. అయినప్పటికీ మరో వైపు రవిపై విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. సాటి యాంకర్ అయిన శశి అయితే చలపతిరావు మరియు రవిలపై విరుచుకుపడ్డాడు. తీవ్ర పదజాలంతో మండిపడిన శశి, ఇలాంటి యాంకర్లు ఉండడం మన దౌర్భాగ్యంగా అభివర్ణించారు.
ఈ సీక్వెల్ ఒరవడి ఇలా కొనసాగుతున్న తరుణంలో యాంకర్ శ్రీముఖితో పాటు ఓ మీడియా ఛానల్ వివరణ ఇచ్చాడు రవి. ఆడియో వేడుకలలో ఇలా సాంకేతిక లోపం తలెత్తే మాట వాస్తవమేనని, అయితే ఆ రోజు ఏం జరిగిందన్నది తనకు తెలియదని, కానీ చలపతిరావు వ్యాఖ్యలను మాత్రం సమర్ధించడం లేదని, పరోక్షంగా యాంకర్ రవి ప్రమేయం లేదన్నట్లుగా శ్రీముఖి వ్యాఖ్యలు చేసింది. మరో వైపు శశి చేసిన వీడియోను మరో యాంకర్ లాస్య షేర్ చేస్తూ… బాగా మాట్లాడావు శశి… అంటూ అభినందించింది.
దీంతో యాంకర్ రవి కేంద్రంగా భిన్న ధ్రువాలు ఏర్పడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఓ వైపు నాటి యాంకర్ భగత్, శ్రీముఖిలు సాంకేతిక లోపం అని చెప్పగా, మరో వైపు శశి, లాస్యలు ఆ ఈవెంట్ లో జరిగిన విధానాన్ని ఖండించారు. అయితే సీన్ లోకి లాస్య ఎంటర్ కావడంతో, పరిస్థితులన్నీ మరింత రసవత్తరంగా మారాయి. ఎన్నో ఏళ్ళ పాటు షోలు చేసిన లాస్య – రవిల నడుమ విభేదాలు తలెత్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు కాస్త సైలెంట్ గా ఉన్న లాస్య, అవకాశం చూసి చావు దెబ్బ కొట్టినట్లుగా కనపడుతోంది.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…